జిడ్డు చర్మానికీ...మాయిశ్చరైజర్!

సాధారణంగా జిడ్డుచర్మతత్వం ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు మాయిశ్చరైజర్ రాసుకోనవసరం లేదనుకుంటారు. వీళ్లకూ అది అవసరమే. ముఖం కడుక్కోవడం వల్ల మురికితోపాటు చర్మంలోని తేమ కూడా బయటకు వెళ్లిపోతుంది. ఇది జిడ్డుచర్మానికీ కూడా వర్తిస్తుంది. దాంతో చర్మం పొడిబారిపోతుంది. తరచూ ఇలాగే జరిగితే చర్మంపై సన్నటి గీతలు, ముడతలు మొదలవుతాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే నీటి ఆధారిత, నూనె లేని మాయిశ్చరైజర్‌ని రాసుకోవాలి.
* వాతావరణం చల్లగా ఉన్నప్పుడు సన్‌స్క్రీన్ రాసుకోకపోయినా ఫర్లేదు అనుకుంటారు కొందరు. వాతావరణం ఎలా ఉన్నా అతినీలలోహిత కిరణాల తాకిడి నుంచి చర్మాన్ని కాపాడుకోవడం అత్యవసరం. కాబట్టి ఏడాది పొడవునా సన్‌స్క్రీన్ రాసుకోవడం తప్పనిసరి. అంతేకాదు రోజులో ప్రతిరెండు మూడు గంటలకోసారి రాసుకుంటూ ఉండాలి. మేకప్ వేసుకుంటున్నాం కదా అని దీన్ని వదిలేయడానికి వీల్లేదు.
* జిడ్డు చర్మతత్వం ఉన్నవారు పైపైన ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చాలనుకుంటారు. కానీ బాగా రుద్ది శుభ్రం చేయాలి. అప్పుడే చర్మరంధ్రాల్లో ఉండే ఫ్రీ రాడికల్స్, మురికి తొలిగిపోతాయి. తక్కువ గాఢత ఉండే జెల్‌ని ఉపయోగిస్తే మంచిది. ఇలా చేయడం వల్ల ముఖంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
* జిడ్డుచర్మం ఉన్నవారు తరచూ మృతకణాలను తొలగించుకోవాలి అని చాలామంది అభిప్రాయం. అయితే తరచూ ముఖం కడగడం, ఎక్కువ ఒత్తిడితో నలుగు పెట్టడం, మృతకణాలను అదేపనిగా తొలగించాలనుకోవడం... ఇవన్నీ చర్మానికి హాని చేస్తాయని మరవకూడదు.
* ఏదో ఒక ఉత్పత్తి వాడితే చాలనుకుంటారు కొందరు. దానివల్ల అన్నిసార్లూ ఫలితం ఉండకపోవచ్చు. అందుకే చర్మతత్వానికి నప్పేదానికే ప్రాధాన్యం ఇవ్వాలి. నాణ్యమైనవాటిని ఎంచుకోవాలి.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు