రక్తహీనతకు అటూ.. ఇటూ!


ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్నిదేశాల్లోనూ మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య రక్తహీనత (ఎనీమియా). మనదేశంలో సగానికంటే ఎక్కువమంది ఈ సమస్యతో బాధపడుతున్నారని అంచనా! అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి ఏదోరకంగా ఈ సమస్య పీడిస్తోందన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థల ప్రకారం... పదిహేను నుంచి 49 ఏళ్ల వరకూ ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు. అమ్మాయిల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉండటానికి కారణం నెలసరి రక్తస్రావమే!
అందుకే చాలా దేశాల్లో అమ్మాయిలకి రుతుస్రావం మొదలవడానికి ముందు నుంచే రక్తహీనతని అడ్డుకునే ఆహారం.. అవసరమైతే మందులూ ప్రత్యేకంగా ఇవ్వాలంటున్నారు. మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అమ్మాయిలకి ప్రత్యేక పోషకాలు కాదుగదా.. అబ్బాయిలకంటే తక్కువ మోతాదు ఆహారమే దక్కుతుంది. ఇక, పెళ్లైయ్యాక కూడా కుటుంబం మొత్తానికి పెట్టి ఆ తర్వాతే తమ ఆకలి తీర్చుకునే అలవాటు ఉండనే ఉంది. వీటన్నింటివల్ల భారతదేశంలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. అందుకే వైద్యులు చెప్పినా చెప్పకున్నా అమ్మాయిలు రక్తహీనతని నివారించే ఆహారం తీసుకోవాలి. దాంతోపాటూ.. ఈ సమస్యపై అవగాహనా పెంచుకోవాలి.
దానికి ముందు..
అమ్మాయిల్లో ఐరన్‌ లోపమే.. రక్తహీనతకి ముందు దశ. సాధారణంగా ఇది పోషకాహారలోపం వల్ల ఏర్పడుతుంది. అమ్మాయిలు కౌమారంలోకి వచ్చాక ఈ పరిస్థితిలో ఉంటే.. నెలసరులు మొదలయ్యాక మరింత పెరుగుతుంది. ఇరవైఏళ్లకంతా ఎనీమియాగా మారుతుంది! వైద్యపరంగా చూస్తే హిమోగ్లోబిన్‌ తగ్గడం రక్తహీనతకి ముఖ్య కారణం. హిమోగ్లోబిన్‌ అన్నది ఇనుము పోషకంతో తయారైన ప్రొటీన్‌. ఇది వూపిరితిత్తుల్లోని ప్రాణవాయువును రక్తం ద్వారా మిగిలిన శరీరానికి అందేలా చేస్తుంది. అందుకే ఇది తగ్గితే శరీరం చురుగ్గా ఉండదు. ఇక.. కొన్ని వ్యాధులు, ప్రమాదాల కారణంగా ఏర్పడే విపరీతమైన రక్తస్రావం వల్ల ఎర్రరక్తకణాలు తగ్గుతాయి. దీనివల్ల కూడా రక్తహీనత ఏర్పడుతుంది.
కారణాలివి..
* నెలసరి సమయంలో రక్తస్రావం కావడం.. అమ్మాయిల్లో ఎనీమియాకి ప్రధాన కారణం. సాధారణంగా నెలసరి వేళ మూడు నుంచి ఐదురోజులపాటు 35 ఎం.ఎల్‌ రక్తం పోతుంది. కొందరికి ఇది 60 ఎం.ఎల్‌ దాకా కూడా ఉండొచ్చు. మళ్లీ ఆ రక్తాన్ని భర్తీ చేయాలంటే.. ఇనుము అవసరం. కానీ చాలామంది ఆ పోషకాన్ని పెద్దగా తీసుకోరు.
* గర్భసంచిలో ఏర్పడే ఫైబ్రాయిడ్ల వల్ల కూడా రక్తస్రావం పెరుగుతుంది. ఇది రక్తహీనతకి దారితీస్తుంది. గర్భనిరోధకంగా వాడే లూప్‌(ఇంట్రా యుటెరైన్‌ డివైజ్‌) ఒక్కోసారి నెలసరి రక్తస్రావాన్ని పెంచుతుంది. ఇందువల్ల కూడా ఈ సమస్య రావొచ్చు.
* కొందరికి అల్సర్‌, ఇతర అంతర్గత రక్తస్రావాల కారణంగా కూడా అనీమియా సమస్య వస్తుంటుంది.
* హెచ్‌ఐవీ, దాని అనుబంధ ఇన్‌ఫెక్షన్‌లు, వాటికి వాడే మందుల వల్లా ఈ సమస్య రావొచ్చు. మూత్రపిండాల సమస్యా, బోన్‌మారో, థైరాయిడ్‌ సమస్యలూ దీనికి దారితీస్తాయి.
* ఆహారపరంగా చూస్తే బి విటమిన్‌ లోపం, బి12, ఫోలిక్‌ యాసిడ్‌ తగ్గడం కూడా రక్తహీనతకు కారణం అవుతుంది.

రక్తహీనత వచ్చాక..
రక్తహీనత ఎదురైతే అలసటా, చురుగ్గా లేకపోవడం, ఏకాగ్రత తగ్గడం, ఉద్వేగాలపై నియంత్రణ లోపించడం, శరీర ఉష్ణోగ్రతలో తేడాలూ, రోగనిరోధకశక్తి తగ్గడం, గుండె దడ, కళ్లు తిరుగుతున్నట్టు అనిపించడం, ఒత్తిడి, అసహనం ఏ పనిపై ఆసక్తి లేకపోవడం వంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. కౌమారం నుంచే ఈ సమస్య ఉంటే గర్భధారణ సమయంలోనూ పట్టించుకోకపోతే నెలలు నిండకుండానే కాన్పు అవుతుంది. ఒక్కోసారి తల్లి ప్రాణానికీ ముప్పు రావొచ్చు. శిశువులు తక్కువ బరువుతో ఉండటమే కాదు.. కొన్నిసార్లు దక్కకపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంతేకాదు పిల్లలు నాడి సంబంధిత సమస్యలూ ఎదుర్కొంటారు. మానసిక ఎదుగుదలలోనూ తేడాలొస్తాయి. రెండోసారి గర్భం దాల్చినప్పుడు ఈ సమస్య మరింత పెరుగుతుంది. రక్తహీనతని సీబీపీ, సీరమ్‌ ఐరన్‌, ఫెరిటిన్‌, ట్రాన్స్‌ఫెరిన్‌ శాచురేషన్‌ అండ్‌ ట్రాన్స్‌ఫెర్రిన్‌ రిసెప్టార్‌ పరీక్షలతో పసిగట్టవచ్చు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com