నిద్రలోనే శుభ్రం! నిద్రతోనే భద్రం!!


ఆధునిక ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అతి పెద్ద సమస్య ఇది! జ్ఞాపకాలు చెరిగిపోతూ.. తీవ్రస్థాయి మతిమరుపు సమస్యలు ఆవహించి.. చెట్టంత మనుషులూ ఎందుకూ కొరగానివారై పోతుండటం దీని లక్షణం. సాధారణంగా 60-65 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుంటుందిగానీ.. ఇటీవలి కాలంలో దీని లక్షణాలు చాలా ముందుగానే మొదలవుతున్నాయని గుర్తించారు. ఒకసారి ఇది ఆరంభమైన తర్వాత సమస్య మరింతగా ముదరటమేగానీ.. తగ్గటమన్నది కష్టం. తొలి రోజుల్లో పేర్లు గుర్తుకురాకపోవటం, పదాల కోసం తడబడటం వంటి లక్షణాలతో ఆరంభమయ్యే ఈ వ్యాధి క్రమేపీ ముదిరి.. చివరికి తమ పనులు తాము కూడా చేసుకోలేని స్థితికి తీసుకువెళుతుంది. వస్తువులు ఎక్కడ పెట్టామో మర్చిపోవటం, గతం గుర్తులేకపోవటం, ఆఖరికి కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టలేని, అసలు తాము ఎక్కడున్నామో, ఇంట్లో ఏ గది ఎక్కడుందో కూడా మర్చిపోయే స్థితికి దారి తీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 4.4 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. ప్రజల సగటు ఆయుర్దాయం, దాంతో పాటే వృద్ధుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆల్జిమర్స్‌ బాధితుల సంఖ్యా విస్తరించిపోతోంది. ఇన్నేళ్లుగా అసలీ సమస్యకు మూలం ఏమిటో, ఈ బాధితుల సంఖ్య ఎందుకు పెరుగుతోందో, దీనికి కచ్చితమైన కారణాలేమిటో ఎవరికీ తెలియరావటం లేదు. ఇప్పుడిప్పుడే ఈ చిక్కుముడి వీడుతున్నట్టు అనిపిస్తోంది. దీనికి కేవలం వృద్ధుల సంఖ్య పెరుగుతుండటమే కాదు, ప్రజల నిద్రా సమయం తగ్గిపోతుండటం కూడా ఒక ముఖ్య కారణం కావొచ్చని పరిశోధకులు నిర్ధ´రణకు వస్తున్నారు.

వయసు పెరుగుతున్న కొద్దీ గాఢమైన నిద్ర అన్నది తగ్గిపోతుంది. మన నిద్రలో కనుగుడ్లు వేగంగా కదులుతుండే గాఢమైన నిద్రా దశ ఒకటి ఉంటుంది. దీన్ని రెమ్‌ (ర్యాపిడ్‌ ఐ మూమెంట్‌) దశ అంటారు. అలాగే కనుగుడ్లు కదలకుండా, నిద్ర గాఢంగా ఉండే దశ కూడా ఉంటుంది, దీన్ని ‘నాన్‌ రెమ్‌’ దశ అంటారు. తాజా అనుభవాలు, ఇటీవలి సంఘటనలన్నీ మెదడులో నిక్షిప్తమై, జ్ఞాపకాలుగా స్థిరపడేది ఈ ‘నాన్‌ రెమ్‌’ దశ నిద్రా సమయంలోనే. అందుకే జ్ఞాపకాలు, ధారణ శక్తి మెరుగ్గా ఉండాలంటే నిద్ర బాగుండాలి, ముఖ్యంగా ఈ నాన్‌ రెమ్‌ దశ నిద్ర తప్పనిసరిగా బాగుండాలి. ఆల్జిమర్స్‌ బాధితుల్లో ఈ గాఢమైన నిద్రా దశే సరిగా ఉండటం లేదు. ఆల్జిమర్స్‌ లక్షణాలు మొదలవటానికి చాలా కాలం ముందే ఈ గాఢ నిద్ర దెబ్బతినటమనేది జరుగుతోందని, కాబట్టి నిద్ర దెబ్బతినటాన్ని ఆల్జిమర్స్‌కు ముందస్తు సంకేతంగా భావించొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. మరో రకంగా చూస్తే గాఢ నిద్ర సరిగా లేకపోవటం వల్లనే ఆల్జిమర్స్‌ ముదురుతుండొచ్చు కూడా! అందుకే ఇప్పుడు పరిశోధకులు ఈ నిద్ర గురించీ, ఆల్జిమర్స్‌ లక్షణాల గురించీ లోలోతుగా పరిశోధిస్తున్నారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com