జిమ్‌కు వెళితే ఇవి తప్పనిసరి..


* విటమిన్‌ సి, డి లు తక్కువగా ఉన్నప్పుడు జిమ్‌లో చేరితే త్వరగా గాయాలపాలయ్యే అవకాశం ఎక్కువ. అలాగే మెగ్నీషియం లోపం ఉంటే అతి తక్కువ సమయంలోనే శక్తిని కోల్పోయి, తిరిగి త్వరగా కోలుకోలేరు. అధిక సమయం పడుతుంది. ప్రతిరోజూ తప్పనిసరిగా ఆహారంలో గ్లాసు పాలు, గుడ్డు, చేప ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే పుల్లటి పండును తింటే సి విటమిన్‌ లోపం ఉండదు. అలాగే ఉదయపు నడక సమయంలో నీరెండ నుంచి డి విటమిన్‌ అందుతుంది.
* జిమ్‌లో చేరేముందు మీరు చేయబోయే వ్యాయామానికి తగ్గ శక్తినివ్వడానికి ప్రొటీన్లు అధికంగా ఉండే కార్బొహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. ఏదైనా ఒక పండు, గుప్పెడు వేరుసెనగ గింజలు లేదా పండ్ల ముక్కలు కలిపిన గిన్నెడు పెరుగు లేదా, ఉడకబెట్టిన చిలకడదుంపతో పాటు గుప్పెడు గింజల్ని తీసుకోవడం ద్వారా పౌష్టికాహారం అందుతుంది. అప్పటివరకు అలసట తెలియని మీ కండరాల్లో మీరు ప్రారంభించిన వ్యాయామం వల్ల త్వరగా అలసిపోవడమే కాకుండా, నిరాసక్తత ఆవహిస్తుంది
* జిమ్‌కు వెళ్లేటప్పుడు, రెండు గంటలు ముందుగా 500 నుంచి 600 మిల్లీలీటర్ల నీటిని తాగడం తప్పనిసరి. వ్యాయామం కారణంగా చెమట ఎక్కువగా పడుతుంది. దీంతో ముందుగా నీరు తాగకపోతే, శరీరంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com