వన్నె కోసం వెన్న!


కొరియన్‌ అమ్మాయిలు తమ సౌందర్య పోషణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇందులో భాగంగా మోము మెరిసిపోవడానికి.. చర్మం బిగుతుగా, తాజాగా మారడానికి.. పల్చటి పొరలాంటి కొరియన్‌ షీట్‌ మాస్క్‌లను ఉపయోగిస్తారు. ఇవి చర్మంపై పెద్ద రంధ్రాలు కనిపించకుండా కూడా చేస్తాయి. వీటిని రాత్రంతా ముఖంపై వేసుకుని ఉదయం పూట తీసేస్తారు. దానివల్ల ముఖం మెరిసిపోతుందని నమ్ముతారు.
పశ్చిమాఫ్రికాలోని ఐవరీకోస్ట్‌లో పొడిచర్మం ఉన్నవారు షీ బటర్‌ వాడతారు. పైగా దాంతో చాలా రకాల పూతలు తయారుచేసుకుంటారు. దీన్ని కరైట్‌ చెట్టు నుంచి లభించే గింజల నుంచి తయారుచేస్తారు. పశ్చిమ ఆఫ్రికాలోని సవాన్నా ప్రాంతంలో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. ఈ బటర్‌లో మేలు చేసే అమినో ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. ఇందులో ఉండే విటమిన్‌ ఎ చర్మకణాలకు మేలుచేస్తుంది. ముఖం, మోచేతులూ, కాలి గోలి వేలి చివరి ప్రాంతాల్లో దీన్ని బాగా రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com