ఇంటర్‌ చదివారా?ఇదిగో అవకాశం


సర్కారీ ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నవారికి శుభవార్త! కేంద్రప్రభుత్వ అన్ని శాఖల్లోని డేటా ఎంట్రీ ఆపరేటర్‌, లోవర్‌ డివిజన్‌ క్లర్క్‌, పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టుల నియామకం జరగబోతోంది. ఇందుకోసం స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ - ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌’ పరీక్షను నిర్వహించనుంది. ఈ పరీక్షలో నెగ్గటానికి ఎలా సంసిద్ధం కావాలో తెలుసుకుందాం!



తాజా నోటిఫికేషన్‌ ద్వారా 3259 ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇవి మూడు రకాలుగా ఉన్నాయి. లోవర్‌ డివిజన్‌ క్లర్క్‌/ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 898, పోస్టల్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 2359, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు: 2.

01.08.2018 నాటికి 18 నుంచి 27 ఏళ్ల వయసున్నవారు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ఎస్‌సీ/ ఎస్‌టీవారికి అయిదేళ్లు, ఓబీసీ వారికి మూడేళ్లు, పీడబ్ల్యూడీ వారికి వయఃపరిమితిలో పదేళ్ల మినహాయింపు ఉంది.

లోవర్‌ డివిజన్‌ క్లర్క్‌: ఈ పోస్టుకు ఎంపికైనవారు తమ ఆఫీసులకు వచ్చే ఫోన్‌కాల్స్‌కు సమాధానం ఇవ్వడం, మెయిల్స్‌ను పరిశీలించి, వాటిని పైఅధికారులకు పంపడం లేదా ఆఫీసురీత్యా ఎవరికైనా కాల్స్‌, మెయిల్స్‌ పంపడం చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల శాలరీ స్లిప్‌లను తయారు చేయడం, ఆఫీసుకు సంబంధించిన ముఖ్యపత్రాలను భద్రపరచడం, అవసరమైన సమయంలో వాటిని పైఅధికారులకు అందజేయడం వంటి పనులుంటాయి. డేటా, ఫైల్స్‌, పత్రాలను జాగ్రత్త చేయడంతోపాటు కార్యాలయ రోజువారీ పనులు సక్రమంగా నడవడంలోనూ క్లర్‌ü్క ప్రమేయం ఉంటుంది.

డేటా ఎంట్రీ ఆపరేటర్‌: ఇంగ్లిష్‌/ హిందీలో లెటర్లను టైప్‌ చేయడం, దరఖాస్తులను పూర్తి చేయడం, ఆఫీసుకు వచ్చిన సమాచారాన్ని కుదించి క్లుప్తంగా పైఅధికారులకు చేరవేయడం, కంప్యూటర్‌లో సంస్థకు సంబంధించిన ఫైల్స్‌, ఇతర ముఖ్య సమాచారాన్ని భద్రపరచడం వంటివి చేయాలి.

పోస్టల్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌: జిల్లా, మండల కేంద్రాలుగా పనిచేసే పోస్టాఫీసుల్లో బుక్‌ వర్క్‌, సిస్టమ్‌ వర్క్‌ చూసుకుంటూ మిగిలిన ఉద్యోగులతో సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకుంటూ రోజువారీ కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించాలి.

విద్యార్హతలు
* 01.08.2018 నాటికి ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సును పూర్తిచేసి ఉండాలి.
* దూరవిద్యా విధానంలో డిగ్రీ, డిప్లొమా పూర్తిచేసిన వారు కూడా అర్హులే.
* చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా ఈ పరీక్షకు అర్హులే. కాకపోతే 01.08.2018 నాటికి కోర్సు పూర్తిచేసి సర్టిఫికెట్లు పొందివుండాలి.

అభ్యర్థులు తమ వివరాలను http://www.ssconline.nic.inవెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. చివరగా వారి దరఖాస్తును ప్రింట్‌ తీసుకుని, జాగ్రత్త చేసుకోవాలి. మహిళలకూ, ఎస్‌సీ/ ఎస్‌టీ/ పీడబ్ల్యూడీ/ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు పరీక్ష ఫీజు ఉండదు. జనరల్‌, ఓబీసీ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు రూ.100ను ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్య తేదీలు:
* దరఖాస్తు పూర్తిచేయడానికి: 18.12.2017
* టయర్‌-1 ఆన్‌లైన్‌ పరీక్ష: 04.03.2018 నుంచి 26.03.2018 వరకు
* టయర్‌-2 డిస్క్రిప్టివ్‌పరీక్ష: 08.07.2018

పరీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్‌: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం
తెలంగాణ: హైదరాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌

టయర్‌-1 పరీక్షలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అండ్‌ మేథమెటిక్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాలు ఉంటాయి. ప్రతి సెక్షన్‌ నుంచి 25 ప్రశ్నలు వస్తాయి.
మూడు అంచెల్లో...
అభ్యర్థుల ఎంపిక మూడు అంచెల్లో జరుగుతుంది.

టయర్‌-1: అభ్యర్థులు ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో రాయాల్సి ఉంటుంది. 60 నిమిషాల్లో 100 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. నాలుగు సెక్షన్లలో ప్రతీదాని నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికీ 0.5 రుణాత్మక మార్కులున్నాయి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలో (ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు) ఉంటాయి.

టయర్‌-1: పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించినవారికి టయర్‌-2 డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు. టయర్‌-1 పరీక్షలో కనీసార్హత మార్కు పోస్టును బట్టి మారుతూ ఉంటుంది. ఒక్కో పోస్టుకు దానికి అనుగుణంగా అర్హత మార్కులను నిర్ణయిస్తారు.

టయర్‌-2: ఇది డిస్క్రిప్టివ్‌ పరీక్ష. దీనిలో లెటర్‌ రైటింగ్‌, అప్లికేషన్‌ రైటింగ్‌, ప్రెసీ అంశాలను పరీక్షిస్తారు. సమయం 60 నిమిషాలు. పరీక్షను పెన్ను-పేపర్‌ విధానంలో రాయాల్సి ఉంటుంది. 100 మార్కులు కేటాయించిన ఈ పరీక్షకు కనీసార్హత మార్కులు- 33. ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుని పరీక్ష రాయవచ్చు.

టయర్‌-3: టయర్‌-2 పరీక్షలోనూ కనీస అర్హత మార్కులు సాధించినవారికి టయర్‌-3 టైపింగ్‌ పరీక్షను నిర్వహిస్తారు. కేవలం క్వాలిఫయింగ్‌ పరీక్ష అయిన టయర్‌-3లో పోస్టునుబట్టి టైపింగ్‌ వేగాన్ని నిర్ణయిస్తారు.

డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుకు 15 నిమిషాల్లో 2000-2200 అక్షరాలను పద రూపంలో తప్పులు లేకుండా టైప్‌ చేయాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (సీఏజీ) పోస్టుకు 15 నిమిషాల్లో 3500 అక్షరాలను పదరూపంలో తప్పులు లేకుండా టైప్‌ చేయాలి.

గమనిక: డేటా ఎంట్రీ ఆపరేటర్‌- కంట్రోలర్‌ ఆడిట్‌ జనరల్‌ (కాగ్‌) పోస్టుకు పోటీపడేవారు సైన్స్‌, మేథమెటిక్స్‌ సబ్జెక్టులను చదివుండాలి.

డిస్క్రిప్టివ్‌ పరీక్షకూ ఇప్పటినుంచే సన్నద్ధమవడం మంచిది. 4, 5 పేరాల్లో ఉన్న సమాచారాన్ని కుదించి, 1-2 పేరాల్లో రాయడం అలవాటు చేసుకోవాలి.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com