మహిళా సింగర్ క్షణికావేశంలో!


వాషింగ్టన్ : కారులోని సౌండ్ సిస్టమ్ వాల్యూమ్ తగ్గించాలని అడిగిన కారణంగా ఓ వ్యక్తిపై వర్ధమాన గాయని తుపాకీతో కాల్పులు జరిపింది. గత నెలలో జరిగిన హత్యాయత్నం కేసులో ఆ మహిళా గాయనికి కోర్టు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించింది. అమెరికాలోని టెన్నెస్సీకి చెందిన కేటీ కాకెన్‌బష్ గాయనిగా, పాటల రచయిత్రిగా రాణిస్తోంది. ఈ క్రమంలో గత ఆగస్ట్ 26న రాత్రి నాష్‌విల్లే సిటీలో ఆమె తన కారును రోడ్డు పక్కన పార్కింగ్ చేసి సౌండ్ సిస్టమ్ ఆన్ చేసింది.

రోజులాగే అదే రోడ్డుపక్కన నిద్రించే గెరాల్డ్ మెల్టన్(54)కు పెద్ద శబ్ధాల వల్ల డిస్టర్బ్ అయ్యాడు. కేటీ కారువద్దకు వచ్చి కాస్త సౌండ్ తగ్గించాలని, లేకపోతే వాహనాన్ని ముందుకు తీసుకెళ్లి పార్కింగ్ చేస్తే తన నిద్రకు భంగం వాటిల్లదని కోరాడు. మర్యాదగా అక్కడినుంచి వెళ్లిపోవాలని ఆ వ్యక్తిని సింగర్ హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. ఇళ్లులేని మెల్టన్ రోజూ అక్కడే నిద్రిస్తాడు కనుక.. మౌనంగా అలాగే నిల్చున్నాడు. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన కేటీ కారు నుంచి బయటకు వచ్చి మెల్టన్ కడుపులో ఓ రౌండ్ కాల్చింది.

బాధితుడిపై మరో రౌండ్ కాల్పులు జరిపిన అనంతరం కేటీ తన కారులో అక్కడినుంచి పరారైంది. స్థానికులు మెల్టన్‌ను హాస్పిత్రిలో చేర్పించడంతో ప్రాణాపాయం తప్పింది. సింగర్ కేటీపై హత్యాయత్నం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు జైలుశిక్షతో పాటు 25వేల డాలర్లు జరిమానా విధించింది. బెయిల్ మీద వివాదాస్పద సింగర్ విడుదల కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఆమె కొన్ని తప్పిదాలు చేసి అరెస్ట్ అయిందని, ఆమె బుద్ధి మారలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com