థియేటర్లలో విశాల్ ఫ్యాన్స్ క్లబ్ ఫ్లయింగ్ స్క్వాడ్!

విశాల్, అను ఇమ్మాన్యుయెల్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘తుప్పరివాలన్’ నేడు విడుదలైంది. ఈ సినిమా చూసిన తమిళ సినీ పెద్దలు.. విశాల్ కెరీర్లో అతి పెద్ద విజయం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే పైరసీ వ్యతిరేకంగా విశాల్ చేస్తున్న పోరాటం.. అతడికి ఓ సవాల్‌ను విసిరింది.
గత మంగళవారం రాత్రి చెన్నై ట్రిప్లికేన్‌లో ‘తమిళగన్’ వెబ్సైట్ అడ్మిన్‌గా భావిస్తున్న గౌరి శంకర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. మొదట సదరు వ్యక్తి తమిళ్ రాకర్స్ అడ్మిన్ అంటూ ప్రచారం జరగడంతో.. సదరు వెబ్సైట్ నిర్వాహకులు సోషల్ మీడియాలో అవాస్తవం అని ప్రకటించారు. మరికొద్దిసేపటికే తమిళగన్ వెబ్సైట్ నిర్వాహకులు ‘‘అమాయకుల్ని అరెస్టు చేయకండి. మీకు చేతనైతే ‘తుప్పరివాలన్’ని కాపాడుకోండి’’ అని సవాలు విసిరారు. పైరసీని అడ్డుకొనేందుకు విశాల్ తీవ్రంగా కృషిచేస్తున్న నేపథ్యంలో ఈ రోజు విడుదలైన ‘తుప్పరివాలన్’ను పైరవీదారులు టార్గెట్ చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో విశాల్ ఫ్యాన్స్ క్లబ్ ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. ముగ్గురు సభ్యులు చొప్పున ఫ్లయింగ్ స్క్వాడ్‌గా ఏర్పడి థియేటర్లలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. థియేటర్ లోపల పైరసీకి పాల్పడకుండా నిఘా ఉంచారు. ఈ మేరకు విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి అన్ని థియేటర్ల మేనేజర్లకు మంగళవారం లేఖలు వెళ్లాయి. తమ ప్రొడక్షన్ హౌస్ నుంచి ముగ్గురు సభ్యులు వస్తారని, థియేటర్లోకి వాళ్లను అనుమతించాలని కోరుతూ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ(వీఎఫ్ఎఫ్) లేఖలు రాసింది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు