ఆరుగురు హీరోయిన్లతో తమిళంలో మూవీ..


మెయిన్‌ హీరోయిన్‌గా రాయ్‌లక్ష్మి
విశ్వనటుడు కమల్‌హాసన్‌ నట విశ్వరూపానికి నిదర్శనమైన ‘దశావతారం’ నుంచి ఇప్పటివరకు దాదాపు 40 తమిళ చిత్రాలను అనువాదరూపంలో తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్‌వీఆర్‌ మీడియా ప్రై. లిమిటెడ్‌ తమిళంలో సినీనిర్మాణం ప్రారంభించబోతోంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన లేడీ ఓరియెంటెడ్‌ థ్రిల్లర్‌ ‘100 డిగ్రీస్‌ సెల్సియస్‌’ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేస్తున్నట్టు నిర్మాత శోభారాణి తెలిపారు. తమిళంలో ఆమె నిర్మిస్తున్న తొలి డైరెక్టు చిత్రం ఇదే.

యదార్థ కథలకు, సామాజిక స్పృహ కలిగిన కథాంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే కోలీవుడ్‌లో సినీ నిర్మాణం ప్రారంభించేందుకు స్ర్తీప్రాధాన్య చిత్రంగా తెరకెక్కిన ‘100 డిగ్రీస్‌ సెల్సియస్‌’ కరెక్టుగా ఉంటుందని ఆమె భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెలలో షూటింగ్‌ ప్రారంభం కానుంది. ‘యారిడి నీ మోహిని’, ‘ఉత్తిమ పుత్తిరన్‌’ చిత్రాల దర్శకుడు మిత్రన్‌ జవహర్‌ తమిళ రీమేక్‌కి దర్శకత్వం వహిస్తారు.

రాయ్‌లక్ష్మికి మెయిన్‌ రోల్‌...
మలయాళ కథలోని మూలకథను మాత్రమే తీసుకుని తమిళం, తెలుగు నేటివిటీలకు తగ్గట్టుగా కథలో మార్పులు చేసినట్టు నిర్మాత చెప్పారు. కథప్రకారం సినిమా మొత్తం ఇండియాలోనే జరుగుతుంది. ఇందులో ఆరుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. ‘జూలీ2’తో త్వరలో బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేయబోతున్న గ్లామరస్‌ బ్యూటీ రాయ్‌లక్ష్మి మెయిన్‌ హీరోయిన్‌గా నటించనుండగా, యువతారలు హెబ్బాపటేల్‌, నందిత శ్వేత, రాగిణి ద్వివేది, నికిషా పటేల్‌ మిగతా పాత్రలకు ఎంపికయ్యారు. మిగతా తారాగణం, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. తమిళం, తెలుగు పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటించబోతున్నారు.

ప్రకృతి అందాలకు నిలయమైన పొల్లాచ్చిలో షూటింగ్‌ ప్లాన్‌ చేస్తున్నారు. రాయ్‌లక్ష్మి రేడియా జాకీ (వీజే) పాత్రలో నటించనుంది. దర్శకుడు కథ చెప్పినప్పుడు రెండు పాత్రల్లో ఆమెకు ఛాయిస్‌ ఇవ్వగా, విభిన్నమైన షేడ్స్‌ కలిగిన వీజే పాత్రని ఆమె ఎంచుకుందట. రాయ్‌లక్ష్మి కెరీర్‌లో ఇదొక వ్యత్యాసమైన చిత్రంగా నిలుస్తుందని నిర్మాత శోభారాణి అన్నారు. నేటి పరిస్థితుల్లో స్ర్తీ ప్రాధాన్య చిత్రాలు మరిన్ని అవసరమని, ఆ దిశగా తాము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని రెండు భాషల ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉందని ఆమె పేర్కొన్నారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com