
ఒకే ట్రైలర్లో నవ్వించడం.. భయపెట్టడం..: హరీశ్ శంకర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జై లవకుశ’ ట్రైలర్ ఆదివారం రిలీజ్ అయింది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రేక్షకులు కూడా సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కారణం ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ త్రిపాత్రిభినయం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకూ ఒక్కొక్క క్యారెక్టర్‌కు సంబంధించిన ట్రైలర్లు వేర్వేరుగా విడుదల చేశారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. ఒక క్యారెక్టర్‌కు మరో క్యారెక్టర్‌తో సంబంధం లేకుండా ట్రైలర్ అదరగొట్టింది. ఈ ట్రైలర్‌పై ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మూడు భిన్న పాత్రల్లో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందంటూ ఎన్టీఆర్‌కు అభినందనల వెల్లువలా వస్తున్నాయి. తాజాగా హరీశ్ శంకర్ జై లవ కుశ ట్రైలర్‌పై స్పందించారు. ఒకే ట్రైలర్లో నవ్వించడం, భయపడటం, భయపెట్టడం కేవలం తారక్‌కే సాధ్యం అని హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు.
Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు