అందుకే తాప్సి పెళ్లి చేసుకుందంటారు!


తెలుగు చిత్రసీమలో మనం చూసిన తాప్సి వేరు. బాలీవుడ్‌ వెళ్లాక తాప్సి వేరు. ‘బేబి’, ‘నామ్‌ షబానా’ లాంటి సినిమాల్లో నటనతో ఆశ్చర్యపరిచింది. ‘పింక్‌’లో అయితే అదరగొట్టేసింది. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌తో దీటుగా నటించి మెప్పించింది. తాప్సిలో ఇంత ప్రతిభ ఉందా? అని ముక్కున వేలేసుకొనేలా చేసింది. బాలీవుడ్‌లో సాధించిన విజయాలు, తెచ్చుకొన్న పేరు.. తెలుగులో తన కొత్త ఇన్నింగ్స్‌కి దోహదం చేస్తాయని నమ్ముతోంది తాప్సి. తను నటించిన ‘ఆనందో బ్రహ్మ’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా తాప్సి చెప్పుకొచ్చిన కబుర్లు ఇవీ.
‘నాకు హార్రర్‌ సినిమాలు నచ్చవు. కానీ ‘ఆనందో బ్రహ్మ’కి ముందు నేనునటించిన ‘గంగ’ హార్రర్‌ చిత్రమే. అయితే తాజా చిత్రంలో హార్రర్‌ కంటే కామెడీ ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిని హార్రర్‌ సినిమాలా చూడకూడదు. దర్శకుడు మహి రాఘవ కాన్సెప్ట్‌ చెప్పగానే ఐదే నిమిషాల్లో సినిమాకి ఓకే చేశా. రెగ్యులర్‌గా దెయ్యం సినిమా అయితే నేను చేసేదాన్ని కాదు. మనుషుల్ని చూసి దెయ్యాలు భయపడటం అనే కాన్సెప్ట్‌తో ఇప్పటివరకు ఎలాంటి సినిమా రాలేదు. అందుకే ఈ సినిమాని ఒప్పుకొన్నాను.’
‘ఇందులో నాలుగు పాత్రలున్నాయి. శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల కిశోర్‌, షకలక శంకర్‌, తాగుబోతు రమేశ్‌.. ఈ నలుగురూ ఆడియన్స్‌ని నవ్విస్తారు. వీరిలో ఒక్కొక్కరికీ ఒక్కొక్క లోపం ఉంటుంది. ఆ లోపంతోనే వినోదం పండించారు. ఇదేమీ కథానాయికా ప్రాధాన్యం ఉన్న సినిమా కాదు. నేనేమీ ఈ సినిమాలో కొత్తగా నటించలేదు. ఈ పాత్రను నేను కాకపోయినా చాలా మంది చేయడానికి రెడీగా ఉంటారు. కానీ కాన్సెప్ట్‌ పరంగా మాత్రం కొత్తది.’
‘చిన్న సినిమానా లేక పెద్ద సినిమానా అని చూడను. సినిమాలో ఒక మంచి పాత్ర ఉంటే చాలు. ‘ఘాజి’లో నా పాత్ర చాలా చిన్నది. అందులో నేను చేసింది ఏమీ లేదు. కానీ ఆ సినిమా గురించి నా కెరీర్‌ మొత్తంలో గొప్పగా చెప్పుకొంటాను. అలాంటి సినిమాల కోసం ఎదురుచూస్తున్నాను.’
‘ఆనందో బ్రహ్మ సినిమా నాకు బిడ్డలాంటింది. నాకు మాత్రం కాన్సెప్టే చెప్పారు. అక్కడినుంచి స్క్రిప్ట్‌ డెవలప్‌ చేసుకుంటూ వచ్చాం. ఆఖరికి ప్రచార కార్యక్రమాలు ఎలా చేయాలి అన్న దానిపై కూడా చర్చించుకున్నాం. దర్శకుడు మహి.. సెట్‌లో కూడా సన్నివేశం వివరించి ‘నీకెలా చేయాలనిపిస్తే అలా చేసేయ్‌’ అన్నారు. ఇంత స్వేచ్ఛ చాలా కొద్ది సినిమాల్లో మాత్రమే దొరుకుతుంది. తెలుగులో నేను విభిన్న పాత్రలు ఏమీ చేయలేదు. బాలీవుడ్‌తో ఆ ప్రయత్నం మొదలైంది. తెలుగులో కూడా భవిష్యత్తులో విభిన్న సినిమాలు చేయాలనుకుంటే అదీ ఈ సినిమా మీదే ఆధారపడి ఉంటుంది.’
‘టాలీవుడ్‌, బాలీవుడ్‌కి తేడా లేదు. బాలీవుడ్‌లో ఫ్లాప్స్‌ ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఏడాది లెక్కపెట్టుకోవాల్సిన హిట్‌ చిత్రాలు నాలుగో, ఐదో ఉన్నాయి. తెలుగులో మాత్రం సక్సెస్‌ రేట్‌ పెరిగింది. ఇక్కడ మంచి సినిమాలు వస్తున్నాయి. అందుకే టాలీవుడ్‌కి, బాలీవుడ్‌కి గ్యాప్‌ తగ్గిపోతోంది. ‘పింక్‌’ సినిమా చూసి నామీద నాకే గౌరవం పెరిగింది. ఇదివరకు అమ్మాయిలు నా వద్దకు వచ్చి ఆటోగ్రాఫ్‌లు అడిగేవారు. మరికొందరు ధన్యవాదాలు చెప్పారు. మున్ముందు ఇండస్ట్రీలో నేను ఉండొచ్చు.. ఉండకపోవచ్చు. ‘పింక్‌’ సినిమా ద్వారా వచ్చిన కాంప్లిమెంట్స్‌ మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను.’
అనంతరం పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘పెళ్లి మాట ఇప్పుడైతే లేదు. భవిష్యత్తులో తాప్సికి సినిమాలు రావడంలేదు అందుకే పెళ్లి చేసుకుంది అన్న కామెంట్లు వినిస్తాయి కూడా. పెళ్లైనా చాలా మంది కెరీర్‌లు కొనసాగిస్తున్నారు. అందుకు ఉదాహరణ శ్రీదేవి, విద్యాబాలన్‌, ఐశ్వర్య రాయ్‌లే’ అని చెప్పుకొచ్చారు తాప్సి.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com