
కక్ష పెంచుకొని.. కసాయిగా మారి

గోకవరం: ప్రియుడి సహాయంతో ఓ యువతి మాజీ ప్రియుడిని హత్య చేసినట్లు డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు వెల్లడించారు. గోకవరం పోలీస్ స్టేషన్లో శనివారం విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం... తిరుమలాయపాలేనికి చెందిన ఒమ్మి నాగశేషు (25), అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చెలకవీధికి చెందిన కుర్ల డెబోరా అలియాస్ దివ్య ఆరేళ్లుగా ప్రేమించుకున్నారు. ఆమె నుంచి నాగశేషు రూ.2 లక్షల నగదు, బంగారు గొలుసు తీసుకున్నాడు. ఏడాది క్రితం నాగశేషుకు కుటుంబ సభ్యులు మరో యువతితో వివాహం జరిపించారు. డెబోరా తన స్నేహితుడైన కరణం శివన్నారాయణను ప్రేమించింది. వీరిద్దరూ నెల రోజులుగా గోకవరంలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకొని కలిసి ఉంటున్నారు. తనను మోసం చేసిన నాగశేషుపై కక్ష పెంచుకున్న డెబోరా తనకు రావాల్సిన సొమ్ము ఇవ్వాలని పలుమార్లు డిమాండ్ చేసింది. అయినా వినకపోవడంతో ఈ నెల 10న అర్ధరాత్రి సమయంలో శివన్నారాయణతో కలిసి నాగశేషు ఇంటికెళ్లి గొడవకు దిగి వెంట తెచ్చుకున్న కత్తిపీట, జామాయిల్ కర్రతో ఆయనపై దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన నాగశేషు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేయగా కోరుకొండ సీఐ ఉమామహేశ్వరరావు, ఎస్సై శివనాగబాబు విచారణచేసి శనివారం ఉదయం నిందితులను అదుపులోకి తీసుకుని దాడికి ఉపయోగించిన కర్ర, ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తామన్నారు. కేసు ఛేదించడంలో చొరవ చూపిన సీఐ ఉమామహేశ్వరరావు, ఎత్తైన శివనాగబాబు. సిబ్బందిని ఎస్సీ, అడిషనల్ ఎస్సీ, నార్త్ జోన్ డీఎస్సీలు అభినందించారు.
Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు