నగర శివార్లలో దాహం కేకలు


రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ,నగరంలోని శివారు ప్రాంతాల్లో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. వేసవి నేపథ్యంలో సరఫరాలో ఇబ్బందుల కారణంగా నీటిని తోడేందుకు (పంపింగ్) ఆటంకం కలుగుతోంది. దీనిలో భాగంగా అర్బన్ పరిధిలో ప్రధాన రిజర్వాయర్లు ఉన్న జడ్జి బంగ్లాకు సరఫరా చేసే బూస్టర్ పంపింగ్ వ్యవస్థ పాడైంది. ఆ ప్రభావం శివారు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై పడింది. నగరంలోని 40 నుంచి 50 డివిజన్లలో రెండు రోజులుగా నీటి కొరత ఏర్పడింది. అదనంగా మోటార్లు అందుబాటులో ఉన్నప్పటికీ అవీ కూడా మరమ్మతులకు గురికావడంతో నీటిని తోడే ప్రక్రియ నిలిచిపోయింది. నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో శివారు ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అసలే మండు వేసవి, నీటి కొరతతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. వేసవిలో ఎండ తీవ్రతకు పంపింగ్లో లోపాలు ఏర్పడుతుంటాయి. నగరపాలక సంస్థ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటే సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. వాస్తవానికి నగరంలో కొంత మేర పురాతన పైపులైన్ వ్యవస్థ పట్టిపీడిస్తోంది. అప్పట్లో ప్రధాన రోడ్డు కింద భాగాన వేసిన పైపులైన్ల వ్యవస్థ, రోడ్ల విస్తరణతో అవి మధ్యకు ఉన్నాయి. రోడ్లపై వెళ్లే భారీ వాహనాల ఒత్తిడికి అవి పగిలిపోతున్నాయి. వేసవిలో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పైపులైన్ వ్యవస్థ మార్చినప్పటికీ, మరికొన్నిచోట్ల మార్చాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రధాన పైపులైన్ల వ్యవస్థలో ఇప్పటికీ 140 కి.మీ. కొత్త లైన్లు మార్చారు. గతంలో సిమెంటు, ఐరన్ పూత పూసిన పైపులు వినియోగించారు. ప్రస్తుతం ఇప్పటి అవసరాలకు అనుగుణంగా ఐరన్ పైపులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో పూర్తి స్థాయిలో పైపులైన్ల వ్యవస్థను ఆధునికీకరించడం వల్ల నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ఆస్కారం ఉంటుంది. గోదావరి చెంతనే ఉన్నా ఇప్పటికే రెండు పూటలా కొన్ని ప్రాంతాల్లోనే తాగునీటిని అవసరాలకు అనుగుణంగా అందిస్తున్నారు. నగరంలో రోజుకు 75 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నారు. పంపింగ్ లీకేజీల కారణంగా కొంత నీరు వృథాగా పోతోంది. 2030 నాటి అవసరాలకు తగ్గట్టుగా రోజుకు 120 ఎంఎల్డీ నీటిని సరఫరా చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సుమారు రూ.180 కోట్లతో పైపులైన్లు మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ ఇంకా పట్టాలెక్కలేదు. జడ్జి బంగ్లా రిజర్వాయర్లకు నీటి సరఫరాలో అంతరాయంపై మరమ్మతులు చేపట్టామని వాటర్ వర్క్స్ డీఈ చంద్రశేఖర్ తెలియజేశారు. ఒక రోజులో యధావిధిగా నీటి సరఫరా పునరుద్ధరిస్తామన్నారు..

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com