
యువగళం విజయానికి పాదయాత్ర

అంబాజీపేట తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తికావడం... విజయవంతం కావటంతో విజయోత్సవ పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు నామన రాంబాబు, డొక్కా జగన్నాథం తెలిపారు. అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జి గంటి హరీష్మాథుర్ ఆధ్వర్యంలో యువగళం పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. ఆంబాజీపేటలో శనివారం కార్యాచరణ ప్రణాళిక సమావేశం ఏర్పాటు చేశారు. మండల తెదేపా అధ్యక్షుడు దంతులూరి శ్రీనురాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పుల్లేటికుర్రు నుంచి అంబాజీపేట వరకు తెదేపానాయకులు, కార్యకర్తలు ఈ నెల 15న పాదయాత్ర నిర్వహిస్తారన్నారు. జిల్లా అధికార ప్రతినిధి దాసరి నీరవెంకట సత్యనారాయణ, ఎంపీటీస్ సభ్యుడు. పబ్బినీడి రాంబాబు, తెదేపా జిల్లా బీసీ విభాగం కార్యదర్శి బొంతు పెదబాబు, సొసైటీ మాజీ అధ్యక్షుడు గణపతి వీరరాఘవులు, జిల్లా సాంస్కృతిక విభాగం అధికార ప్రతినిధి రవణం రాము, మండల ఎస్సీ విభాగం అధ్యక్షుడు నాగాబత్తుల వెంకటసుబ్బారావు, పుల్లేటికుర్రు సర్పంచి జల్లి బాలరాజు పాల్గొన్నారు
Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు