
అప్పటివరకు ఆడి.. అంతలో ఆత్మహత్య

కొవ్వూరు పట్టణం: ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు,పట్టణ పోలీసుల సమాచారం మేరకు.. ఇందిరమ్మ కాలనీ 324 నెంబరు గల ఇంట్లో వేములపూడి దివాకర్,వీరవేణి నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె వనిత వరలక్ష్మి (23) డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం కంప్యూటరు కోర్సు నేర్చుకుంటోంది. వారం క్రితం ధవళేశ్వరం నుంచి బంధువులు వచ్చారు. శనివారం సాయంత్రం బంధువులతో కలిసి షటిల్ ఆడింది. అనంతరం తల్లిదండ్రులు, సోదరుడు సదాశివ, బంధువులు గోష్పాద క్షేత్రంలో స్నానంచేసేందుకు వెళ్లగా తాను రానని ఇంట్లోనే ఉండిపోయింది. 7 గంటల సమయంలో వారు తిరిగొచ్చేసరికి ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. ఎంతకూ తీయకపోవడంతో బలవంతంగా తెరిచి చూసేసరికి ఫ్యానుకు చీరతో ఉరేసుకుని కనిపించింది. సీఐ రవికుమార్, ఎస్ఐ దుర్గాప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు
Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు