వర్సిటీ అభివృద్ధికి సమష్టి కృషి


నన్నయ విశ్వవిద్యాలయం, (రాజానగరం): నాణ్యమైన విద్యనందించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని నూతన వీసీ ఆచార్య కె.పద్మరాజు పిలుపునిచ్చారు. శనివారం వీసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విశ్వవిద్యాలయ కన్వెన్షన్ సెంటర్లో సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కువ అనుబంధ కళాశాలలతో పెద్ద వర్సిటీగా పేరొందిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు. ఎటువంటి వివక్ష లేకుండా సమష్టి కృషితో పని చేస్తే వర్సిటీ అభివృద్ధి చెందుతుందన్నారు. విశ్వవిద్యాలయ కేంద్ర పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ గదిని ఆయన ప్రారంభించారు. విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు, అనుబంధ కళాశాలల యాజమాన్యాల వారు పాల్గొన్నారు
బాధ్యతల స్వీకరణ: నన్నయ విశ్వవిద్యాలయం ఐదో ఉపకులపతిగా ఆచార్య కె. పద్మరాజు బాధ్యతలు స్వీకరించారు. విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది. ఆయనకు ఘనస్వాగతం పలికారు. వర్సిటీలో నన్నయ, డా. బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్సీసీ క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వేద పండితులు పూర్ణకుంభంతో ఆహ్వానించి వేదాశీర్వచనం చేశారు. ఇన్చార్జి వీసీ ఆచార్య జీవీఆర్ ప్రసాదరాజు, రిజిస్ట్రార్ ఆచార్య టి. అశోక్ సమక్షంలో ఆచార్య పద్మరాజు అధికార పత్రాలపై సంతకాలు చేసి వీసీగా బాధ్యతలు స్వీకరించారు. వర్సిటీ రాజమహేంద్రవరం, కాకినాడ, తాడేపల్లిగూడెం ప్రాంగణాల అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు, అనుబంధ కళాశాలల యాజమాన్యాలు వీసీకి పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇన్ఛార్జి వీసీగా సేవలందించిన జేఎన్టీయూకే వీసీ ఆచార్య జీవీఆర్ ప్రసాదరాజును ఈసీ హాలులో సన్మానించి వీడ్కోలు పలికారు

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com