
64 న్యాయస్థానాలు.. 2 వేల కేసులు

దానవాయిపేట (రాజమహేంద్రవరం): జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం తూర్పు గోదావరి,కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని మొత్తం 64 కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మొత్తం 50 బెంచ్‌లు ఏర్పాటుచేయగా రాత్రి 9.30 గంటల సమయానికి 11 వేల కేసులు పరిష్కరించారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలో కార్యక్రమాన్ని ఆదనపు జిల్లా న్యాయమూర్తి యూ. యూ. ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యయప్రయాసలు లేకుండా సత్వర న్యాయం పొందాలంటే లోక్ అదాలత్ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. అదాలత్‌లో పరిష్కరించిన వివిధ కేసులకు సంబంధించి కక్షిదారులకు పరిహార, హామీ పత్రాలు అందజేశారు. ప్రజలు, కక్షిదారులకు లోక్ అదాలత్ప మరింత అవగాహన పెంచే బాధ్యత అందరిపై ఉందన్నారు. కేసుల పరిష్కారానికి అవసరమైన వైద్య ధ్రువపత్రాల జారీకి వైద్యాధికారులను అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో వివిధ న్యాయస్థానాల న్యాయమూర్తులు ఎం.నాగేశ్వరరావు, పీఆర్ రాజీవ్, ఎం. మాధురి, కె.ప్రత్యూష కుమారి, రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.యు.వి.బి.రాజు, రవాణా శాఖ అధికారులు, బీమా, టెలికం సంస్థల ప్రతినిధులు,కక్షిదారులు పాల్గొన్నారు
Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు