
సమస్యలు పరిష్కరించే దిశగా 'జగనన్నకు చెబుదాం'

టి.నగర్(రాజమహేంద్రవరం),సమస్యలు పరిష్కరించే దిశగా మరింతగా ప్రజలకు చేరువయ్యేలా జగనన్నకు చెబుదాం కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడారు. ఇకపై ప్రతి మూడో సోమవారం కలెక్టర్, ఎస్పీ సంయుక్తంగా స్పందన కార్యక్రమం చేపడతామన్నారు. 1902 టోల్ ఫ్రీ నంబరు ద్వారా నేరుగా ఫిర్యాదు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుతుందన్నారు. తద్వారా క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న అధికారులు మరింత బాధ్యతతో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతారన్నారు. జేకేసీ నిరంతర పర్యవేక్షణ కోసం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రాజెక్టు మానటరింగ్ యూనిటు, జిల్లా స్థాయిలో ఆడిటింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. మండల స్థాయిలో ఇప్పటి వరకూ తహసీల్దారు, మండల అభివృద్ధి అధికారులు విడిగా వారి కార్యాలయాల్లో స్పందన నిర్వహిస్తున్నారని, ఇకపై ఒకేచోట ఇద్దరూ కలిసి ప్రజల నుంచి అర్జీలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జేసీ తేజ్ భరత్, డీఆర్వో నరసింహులు, ఆర్డీఓ చైత్ర వర్షిణి తదితరులు పాల్గొన్నారు
Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు