తెలుగు భాషలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు


ధవళేశ్వరం ప్రభుత్వ అధికారులు సరళమైన తెలుగు భాషలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని ఆంధ్రప్రదేశ్ భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కార్యక్రమాలలో తెలుగు భాష అమలు చేయడంపై నిర్వహించిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మౌఖిక భాషను పరిపాలనా భాషగా అమలు చేయడానికి ప్రతిఒక్కరూ ప్రయత్నం చేయాలన్నారు. రాష్ట్రంలో తెలుగు వికాసానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాజమహేంద్రవరం తెలుగు భాషకు అమ్మలాంటివన్నారు. రానున్న రోజుల్లో రోడ్డుల ద్వారా వచ్చే తీర్పులు స్థానిక భాషలో ముద్రించి ఇచ్చే అవకాశం కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తికి విన్నవిస్తామన్నారు. డీఆర్వో నరసింహులు మాట్లాడుతూ స్పందన ఫిర్యాదుల విషయంలో నూరుశాతం తెలుగు అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీవో మల్లిబాబు, అదనపు ఎస్పీ సి. హెచ్. పాపారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com