మల్లిడి ఆదినారాయణ రెడ్డి పయనం ఎటువైపు ??


మల్లిడి ఆదినారాయణ రెడ్డి పయనం ఎటువైపు ??

* అసలు ఎవరు ఈ ఆదినారాయణ రెడ్డి *
* అనపర్తికి కాబోయే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి *
* ప్రస్తుత ఎమ్మెల్యే డా.సూర్యనారాయణ రెడ్డి గెలుపుకు ఆదినారాయణ రెడ్డి ఎంతవరుకు కారణం *

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక భారీ మెజారిటీతో గెలిచినా ఒక నియోజకవర్గం అనపర్తి . ఈ అనపర్తి నియోజకవర్గానికి డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రాతినిత్యం వహిస్తున్నారు. 2014 లో మొట్ట మొదటి సారిగా డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి పోటీ చేసినప్పటికీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు దేశం ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి పై సుమారు 1300 ఓట్లు మెజారిటీతో ఓటమిపాలు అయ్యారు. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి అనపర్తి నియోజకవర్గంలో మల్లిడి ఆదినారాయణ రెడ్డికి ఒక సముచిత స్థానం ఉంది. ఏ కార్యకర్తకు అయినా కష్టం వచ్చింది అంటే నేను ఉన్నాను అంటూ భరోసా ఇస్తూ తన అభిమానులను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకునే నైజాం కలిగిన వ్యక్తి మల్లిడి ఆదినారాయణ రెడ్డి.
2012 అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా నియమితులు అయినా డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి కి ప్రతి క్షణం ఆయన వెంట నడుస్తూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసారు. దురదృష్టవశాత్తు 2014 లో తెలుగు దేశం ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది . వచ్చిన వెంటనే డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి వెనుక నడిచిన కొంత మంది నాయకులు గప్చిప్ అయ్యారు . కొంత మంది అప్పటి తెలుగు దేశం ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి తో జతకట్టారు . అయినా మల్లిడి ఆదినారాయణ రెడ్డి మాత్రం డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి కి నేను ఉన్నాను అంటూ భరోసా ఇస్తూ , పార్టీ ఉనికిని కాపాడేందుకు అష్ట కష్టాలు పడ్డారు. టీడీపీ హయాంలోనే మల్లిడి ఆదినారాయణ రెడ్డి పై అనపర్తి పోలీస్ స్టేషన్ లో అనేక కేసులు నమోదయ్యాయి . వాటిని ఏమి లెక్కచేయకుండా వైకాపా పార్టీ మనుగడకు కృషి చేసారు . అప్పట్లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలో వైకాపా నుండి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయగా , తెలుగు దేశం పార్టీ నుండి దొరబాబు పోటీ చేసి విజయం సాధించారు . అయితే 2012 నుండి 2019 ఎన్నికల వరుకు ఆదినారాయణ రెడ్డి తీవ్ర ఇబ్బందులకు గురుయ్యారు . ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయారు . అనపర్తి నియోజకవర్గ పరిసర ప్రాంతంలో మల్లిడి ఆదినారాయణ రెడ్డి అంటే తెలియని వ్యక్తి ఉండరు అంటే అయన అంటే ఏంటో అర్థం చేసుకోవచ్చు. సహాయం కోసం వెళ్లే ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం , కష్టం అంటే నేనున్నానంటూ భరోసా ఇచ్చే నైజాం కలిగిన ఆదినారాయణ రెడ్డి ని వైఎస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చాక దూరం పెడుతూ వచ్చింది. వైకాపా అధికారం లోకి వచ్చాక ఆదినారాయణ రెడ్డి పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరులా అయ్యింది . ప్రస్తుతం డా.సూర్యనారాణ రెడ్డి వద్ద చక్రం తిప్పేది టీడీపీ నుండి వచ్చిన కొంత మంది నాయకులు ,మరియు డా .సూర్యనారాయణ రెడ్డి కుటింబీకులు .ఒకానొకదశలో కొత్తగా వచ్చిన నాయకుల వల్లనే ఆదినారాయణ రెడ్డిను పార్టీ నుండి సస్పెండ్ చేశారనే వినికిడి ఉంది. పార్టీ నుండి సస్పెండ్ చేసిన అనేక మంది వైకాపా సీనియర్ నాయకులు కాకినాడకు చెందిన ఒక ఎమ్మెల్యే తో మంచి సంబంధాలు ఆదినారాయణ రెడ్డి కు ఉంది . ఆదినారాయణ రెడ్డి ని పార్టీ నుండి తొలగించడం వల్ల అనపర్తి నియోజకవర్గ వైపాకాకు నష్టం ఉంది కానీ ఆదినారాయణ రెడ్డి కి ఎటువంటి నష్టం ఉండదు .అయితే ఆదినారాయణ రెడ్డి వైకాపా ను వీడటం కానీ , జనసేన లో చేరడం పట్ల ఎటువంటి అధికారిక ప్రకటన లేదు .
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ అప్పుడే ప్రారంభం అయ్యింది .ఆదినారాయణ రెడ్డి జనసేనలో చేర్చుకోవాలని ఇప్పటికే ప్రయత్నం మొదలయిందని విశ్వసనీయ సమాచారం.రానున్న ఎన్నికల్లో జనసేన _- టీపీడీ పొత్తు దాదాపు కాయం అయినట్లే కనిపిస్తుంది . ఒకవేళ ఆ పొత్తు అమల్లోకి వస్తే అనపర్తి నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తే , జనసేన నుండి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తే సుమారు 55 వేల మెజారిటీ పైనే వచ్చే అవకాశం ఉంది .ఆదినారాయణ రెడ్డి కి అభిమానులు వైకాపా పార్టీలో ఉన్నారు . వారందరు కూడా ఆదినారాయణ రెడ్డి కి మద్దతు ఇస్తారు . అదీకాకుండా పొత్తులో భాగంగా ఉన్న జనసేన టీడీపీ చెందిన నాయకులు , కార్యకర్తల ఓట్లు సర్వ సాధారణంగా ఆదినారాయణ రెడ్డి కి పోల్ అవుతాయి .

ఆదినారాయణ రెడ్డి కి నియోజకవర్గం వారీగా పోల్ అయ్యే ఓట్ల వివరాలు :
టీడీపీ ఓటు బ్యాంకు : 42 %
జనసేన ఓటు బ్యాంకు : 18 %
వైకాపా ఓటు బ్యాంకు : సుమారు 14 %
ఆదినారాయణ రెడ్డి అభిమానులు : 3 %
వాస్తవానికి ఈ లెక్క ప్రకారమే అనపర్తి నియోకవర్గంలో ఆదినారాయణ రెడ్డి కి ఓటు బ్యాంకు ఉండబోతుంది . నియోజకవర్గం వారీగా ఆదినారాయణ రెడ్డి కి 70 - 75 శాతం వరుకు ఉంటుంది . అయితే ఆదినారాయణ రెడ్డి ఇంత వరుకు ఏ పార్టీలో చేరుతారన్నది సమాచారం అయితే లేదు..

రాష్ట్ర రాజకీయాలతో బిజీ బిజీ గా అనపర్తి మాజీ శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి

అనపర్తి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా ప్రాతినిత్యం వహిస్తున్న రామకృష్ణ రెడ్డి ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బిజీ బిజీ గా ఉంటున్నారు . రానున్న ఎన్నికలను జనసేన , టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది . వచ్చే ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ లోని ఉభయగోదావరి జిల్లా లో ఎవరికి ఏ సీట్ కేటాయించాలని అలాగే ఎన్నికల గెలుపు కోసం రామకృష్ణ రెడ్డి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది .ఒక మాటలో చెప్పాలి అంటే రామకృష్ణ రెడ్డి స్టార్ కాంపైనర్ గా ఉండబోతున్నారు . రానున్న ఎన్నికల్లో తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలో కి వస్తే రామకృష్ణ రెడ్డికి మంత్రి పదవి పై అధినేతల నుండి భరోసా వచ్చినట్లు సమాచారం .అయితే పొత్తులో భాగంగా అనపర్తి నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తే శాసన మండలి ద్వారా రామకృష్ణ రెడ్డికి మంత్రి పదవి లభించనుంది . ఒకవేళ ఇదే జరిగితే ఒకే నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే , ఒక మంత్రి ఉండడంతో నియోజకవర్గ అభివృద్ధి పరుగులు పుట్టబోతుంది.

విశ్లేషణాత్మక కధనం T .D .RMovie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com