గుడికి వెళ్తే బోడిలింగాలుగా మారుస్తున్న దేవదాయ శాఖ..


గుడికి వెళ్తే బోడిలింగాలుగా మారుస్తున్న దేవదాయ శాఖ..
*హిందూ దేవాలయాల్లో అసలు ఏమి జరుగుతుంది *
* భక్తులను దోచుకుంటున్న దేవదాయ శాఖ *
* రావులపాలెం అతి సమీపంలో గల వెంకన్న ఆలయంలో ఎదేచ్చగా దోపిడీ *
* వెదిరేశ్వరంకి చెందిన ప్రైవేట్ వ్యక్తులు ఆలయంలో హల్చల్ *
* అపర కోటీశ్వరుడుగా మరీనా ఒక కార్యనిర్వహణ అధికారి *

ప్రతి మనిషి ప్రశాంతత కొరకు దేవాలయాలకు వెళ్లడం సర్వ సాధారణం.. మనిషి చేసిన తప్పులను సరిదిద్దుకుని పశ్చాతాపం పడే ఒక స్థలమే దేవాలాయం అని చెప్పవచ్చు.దేవాలయం అంటే దేవుడు నివాసం ఉండే ప్రదేశంగా భక్తులు కొలుస్తారు.అయితే ఏ మతం లోని లేని విధానాలను , సంప్రదాయాలను దేవదాయ శాఖ హిందూ దేవాలయాలకు వర్తింప చేస్తుంది. మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికం గా మూడు మతాలు ఉన్నాయి .అందులో హిందూ, క్రిస్టయిన్, ముస్లిం ప్రధమంగా ఉంటారు.క్రిస్టయిన్స్ చర్చి లో ప్రతి ఆదివారం ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే చర్చి లో ఎటువంటి హుండీలో ఉండవు. ప్రసాదాలకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండవు. చర్చి లో భక్తుల వాహనాలకు ఎటువంటి పార్కింగ్ రుసుము కట్టక్కర్లేదు.ఈ ప్రార్థనలకు పేద , ధనిక అనే భావాలు చర్చ్ లో ఉండవు . అందరికి ఒకటే ప్రార్థన . ప్రార్థన అనంతరం ఎవరికి నచ్చినంత వాళ్ళు విరాళాలు (కానుకలు ) సమర్పించవచ్చు. ఇలా వచ్చిన సొమ్మును ఆ చర్చ్ పాస్టర్లు ప్రతి నెలలో ఒకరోజు ఆ చర్చ్ కి వచ్చే కొంతమంది పేదలకు ఉచిత కిరానా, మరియు పెన్షన్ రూపంలో కొంతమందికి పంపిణి చేస్తారు . ఇది క్రిష్టియన్ చర్చ్ లో జరిగే విధానం..

ముస్లిమ్స్ ప్రతి శుక్రవారం నమాజ్ లను మసీద్ లో నిర్వహిస్తూ ఉంటారు . నమాజ్ లో కేవలం మగవాళ్ళు మాత్రమే పాల్గొంటారు. నమాజ్ కి వచ్చే భక్తులకు ఎటువంటి పార్కింగ్ రుసుములు ఉండవు. నమాజ్ అనంతరం ఎటువంటి చందాలను మరియు కానుకలను ఎవరికి సమర్పించాల్సిన అవసంరం ఉండదు. ప్రతి సంవత్సరం రంజాన్ సమయంలో ముస్లిం సోదరులు తమకు తోచిన అంత సహాయాన్ని ఫండ్ రూపంలో మసీద్ కు చెల్లిస్తారు. ఆ వచ్చిన సొమ్ముతో మసీద్ అభివృద్ధికి మరియు ఆర్ధికంగా వెనుకబడిన ముస్లిం సోదరులకు ఈ ఫండ్స్ ను వారికీ అందజేస్తారు .

మన హిందూ దేవాలయాలు మాత్రం దీనికి బిన్నంగా ఉంటాయి. దోచుకోవడమే ప్రధాన లక్యంగా మన హిందూ దేవదాయ శాఖ ఉంటుంది.వాస్తవంగా హిందూ దేవాలయాల మీద వచ్చే ఆదాయం ఎంత అనేది అసలు ఎవరికీ తెలీదు. దేవాదాయ శాఖలు చూపించే లెక్కలకు , వచ్చే ఆదాయానికి ఎటువంటి సంబంధం ఉండదు అనేది బహిరంగ రహస్యమే . మన తెలుగు రాష్ట్రలో ఒక విధికి ఒక గుడి ఉంటుంది. ప్రతి గుడికి ఏదో ఒక విశిష్టత ఉంటుంది అని ప్రచారం చేసి తద్వారా ఎదేచ్చగా దోచుకుంటున్నారు. ఒక సామాన్యుడు కొన్ని కొన్ని దేవాలయాల్లో వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ ఫీజు ఉంటుంది .ఆ పార్కింగ్ రుసుము ఇలా ఉంటుంది అంటే ద్విచక్ర వాహనానికి 20 - 30 రూపాయిలు , మరియు కార్లకు 50 - 70 రూపాయిలు వరుకు ఉంటుంది. ఇంకా దేవుని దర్శించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా రుసుము చెల్లించాల్సిందే. కొన్ని దేవాలయాలకు దర్శనం టిక్కెట్లు 10 - 50 రూపాయిలవరుకు ఉంటుంది. అలాగే శీఘ్రదర్శనం అని మరొక దర్శనం ఉంటుంది. ఆ దర్శనానికి అయితే 100 - 500 రూపాయిలవరుకు ఉంటుంది . ఈ రుసుము కేవలం దర్శనానికి మాత్రమే , మరియు గోత్రనామాలు చదవాలి అంటే మరి కొద్దీ రుసుము చెల్లించాల్సిందే . దర్శనం అనంతరం కొన్ని ప్రముఖ దేవాలయాల్లో వేదాశీర్వాదం అనే ఆశీర్వాదానికి 500 నుండి 3000 వరుకు ధర పలుకుతుంది. దర్శనం అనంతరం ప్రసాదాలకు అదనపు రుసుములు చెల్లించి తీసుకుకోవాల్సిన పరిస్థితి ఒక హిందూ దేవాలయాలకు మాత్రమే దక్కుతుంది.వాస్తవానికి ఒక సాధారణ , మధ్య తరగతి వ్యక్తి హిందూ దేవాలయంలో దర్శనం చేసుకోగలడా అనే ప్రశ్న వస్తే చేసుకోలేరు అన్న సమాధానమే వస్తుంది .హిందూ దేవాలయాల్లో దర్శన టికెట్ మీద వచ్చే ఆదాయం , భక్తులు మొక్కుబడి చెల్లించే హుండీ ఆదాయం, పార్కింగ్ మీద వచ్చే ఆదాయం మరియు చెప్పులు భద్రపరిస్తే వచ్చే ఆదాయం , సెల్ ఫోన్ భద్రపరిస్తే వచ్చే ఆదాయం , ప్రసాద విక్రయం , అన్నదాన చందాలు , దేవస్థానం వద్ద ఉండే షాప్స్ వద్ద నుండి వచ్చే ఆదాయం అన్ని కూడా దేవదాయ శాఖకు చెందుతుంది.. ఏ భక్తుడు ఎంత సొమ్ము హుండీ లో వేస్తాడు అనేది ఎవరికి తెలియని రహస్యం,హుండీలో వేసిన సొమ్ము సక్రమంగా దేవాదాయ శాఖకు చెందుతున్న అంటే దానికి ఎవరు అవునని సమాధానం చెప్పలేరు. గతంలో దేవాలయాలు నిర్మించి వంశపార్యపరంగా ఆ గుడి బాగోగులను , అభివృధికి తమ ఆస్తులను అమ్మి గుడిని సక్రమంగా నడిపించేవాడు . కాలక్రమేణా ఆ నీతి అంతమైంది .మన పూర్వికులు అనేక మంది దేవుడి సొమ్ము అపహరిస్తే మహా పాపంగా భావించి తమ కుటుంబాల్లో సమస్యలు,అభివృద్ధి లో ముందుకు రామని భావించేవారు. మన అందరికి ఎంతో సుపరిచితులు విజయనగరం మహా రాజులు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కుటుంబం కొన్ని కోట్లాది రూపాయిల ఆస్తులను దేవాలయాల అభివృధికి , దేవాలయాల నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా దేవయాలకు రాజకీయ రంగులను వేయడం మరో విశేషం . గత కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఈ ఆచారం అధికంగా ఆచరణలోకి వచ్చింది . ప్రతి చిన్న, పెద్ద దేవాలయాకు పార్టీ కార్యకర్తలకు చైర్మన్ పదవులు ఇచ్చి ఎంత దండుకుంటే అంత దోచుకోవచ్చు అన్న అన్నచందాన మారిపోయింది ప్రస్తుత దేవాలయాల పరిస్థితి. అధికారంలోకి వచ్చే పార్టీలు నియమించే చైర్మన్లు , మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారులు కలిసి కోట్లు గడించారు. ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని దేవాలయాలకు గల కార్యనిర్వహణ అధికారులకు బినామీలుగా చోటా నాయకులూ ఉన్నారు అంటే వారి అక్రమ సంపాదన ఏ స్థాయిలో ఉందొ ఆలోచించవచ్చు.

రావులపాలెం కు అతి సమీపంలో గల ఒక వెంకన్న ఆలయంలో రాజుల హావ!
కోనసీమ జిల్లా రావుల పాలెం కు అతిసమీపంలో గల ఒక వెంకన్న ఆలయం గత కొద్దీ సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతుంది.ఆ దేవాలయానికి ఒకే కార్యనిర్వహణ అధికారి 6 సంవత్సరాలు పైగా ఉన్నారంటే ఆ రాజుగారి సంపాదన మీ ఊహకే వదులుతున్నాం. ఒక కార్యనిర్వహణ అధికారి ఒక దేవస్థానం లో 2 - 3 సంవత్సరాలు వరుకు విధులు నిర్వహిస్తారు . కానీ ఈ వెంకన్న ఆలయంలో గల ఈవో 6 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు అంటే 2 ప్రభుత్వ హయాంలో అతని పలుకుబడి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రజా ప్రతినిధులకు ఎంత బాగా సేవ చేస్తున్నారో రావులపాలెం పరిసర ప్రాంత ప్రజలకు తెలుసు .ఒక ఆలయ ఈవో సంపాదన కొన్ని కోట్లాది రూపాయలకు చేరింది అంటే ఆలయ ఈవో భక్తుల సొమ్ముకు ఎంత కన్నం వేస్తున్నారో ప్రభుత్వ ఉన్నత అధికారులు , జిల్లా కలెక్టర్లు ఆరా తీసుకోవాలి.ఈ వెంకన్న ఆలయంలో రాజుల హవా ఒక తార స్థాయికి చేరుకుంది. వెంకన్న దర్శనం మీకు కావాలంటే వెంకన్న ఆశీస్సుల సరిపోవు , ఆ గుడిలో ఉన్న వెదిరేశ్వరం గ్రామానికి చెందిన ఒక చిన్న రాజుగారి ఆశీస్సులు తప్పకుండ ఉండవలిసిందే. ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందుతున్నప్పటికీ ఆలయ చైర్మన్ మరియు ఇతర ప్రవైట్ వ్యక్తుల హావ ఈ దేవస్థానంలో పుష్కలంగా కనిపిస్తుంది.

ఇలా మన హిందూ దేవాలయాల్లో సామాన్య భక్తులు వేసే కానుకలను , మొక్కుబడులను దోచుకొని కొంత మంది కార్యనిర్వహిణ అధికారులు , అధికారంలోకి వచ్చి పార్టీ ద్వారా నియమించబడిన చైర్మన్లు మరియు పాలకమండలి సభ్యులు ఎదేచ్చగా దోచుకుంటూ వారి ఎదుగుదలకు హద్దు , అదుపు లేకుండా పోయింది .

story By : T.D.R

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com