శ్రీ లక్ష్మినరసింహ స్వామి బాలాలయంలో రెండో రోజు మహాకుంభ సంప్రోక్షణ పూజలు


శ్రీ లక్ష్మినరసింహ స్వామి బాలాలయంలో రెండో రోజు మంగళంవారం మహాకుంభ సంప్రోక్షణ పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు శాంతి పాఠం జరిగింది. తర్వాత అపధారలు, యాగశాలలో చతుస్థానార్చన నిర్వహిస్తున్నారు. సాయంత్రం శాంతి హోమం, నవకలశ స్నపనం జరగనుంది. యాదాద్రి క్షేత్రంలో సప్తాహ్నిక పంచకుండాత్మక మహాకుంభిషేక మహోత్సవాలకు వేదపండితులు, యాజ్ఞికులు సోమవారం శ్రీకారం చుట్టారు.
స్వామి వారి జన్మనక్షత్రం రోజున మొదలవుతున్న మహోత్సవాలు వారం రోజుల పాటు అత్యంత వైభవంగా కొనసాగనున్నాయి. భక్తుల రాక, వేదికపర్వాలతో యాదాద్రి క్షేత్ర పరిసరాలు ఉత్సవ శోభను సంతరించుకున్నాయి. దేవతల సర్వసైనాధ్యక్షుడైన విశ్వక్సేనుడికి తొలిపూజతో బాలాలయంలో వైదిక పర్వాలు మొదలయ్యాయి. దివ్య మనోహరంగా అలంకరించిన స్వామి, అమ్మవార్లను ప్రత్యేక వేదికపై అధిష్టింపజేశారు. బాలాలయంలోని ఉత్సవమూర్తుల ఎదుట పంచామృత కలశాలకు దర్భ(గరిక)లతో పూజలు నిర్వహించి, పుణ్యజలంగా సంప్రాప్తి కల్పించారు . మంత్రీకృ త పుణ్యాజలాలతో ప్రదానాలయం, బాలాలయ మండపం, పరిసరాలను, కొండపై నలుదిక్కుల పవిత్ర జలాన్ని సంప్రోక్షిస్తూ పుణ్యహవాచనం వేడుకలను నిర్వహించారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com