గుంటూరులో ర్యాగింగ్ ఘటనపై వైద్య కళాశాల ప్రిన్సిపల్ స్పందన


గుంటూరు జిల్లా వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటనపై ప్రిన్సిపల్ పద్మావతి స్పందించారు. ఈ నెల 16న యాంటీ ర్యాగింగ్ కంప్లైంట్ సెల్‌కు ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. అబ్బాయిల వసతి గృహంలో ఘటన జరిగినట్లు ఫిర్యాదు వచ్చిందని... వెంటనే యాంటీ ర్యాగింగ్ కమిటి అప్రమత్తమైందని చెప్పారు.
మొదటి ఏడాది తరగతులు మొదలై కొద్ది రోజులే అయిందన్నారు. విద్యార్థులతో వ్యక్తిగతంగా మాట్లాడారని... అయితే విద్యార్థులు ఎవరూ ర్యాగింగ్ విషయం తమ వద్ద చెప్పటం లేదని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా తాము మాట్లాడామని, సీనియర్ విద్యార్థులకు గట్టిగా కౌన్సిలింగ్ కూడా ఇచ్చామని ప్రిన్సిపల్ చెప్పారు. సరదాగా చేసే పని జీవితాలు నాశనం చేసే ప్రమాదం ఉందన్నారు. తాము ర్యాగింగ్ చేయలేదని సీనియర్లు చెబుతున్నారని తెలిపారు. విద్యార్థులకు యాంటి ర్యాగింగ్ సెల్ నంబర్లు కూడా ఇచ్చామని... మెస్‌లో కూడా సీనియర్లు, జూనియర్లు కలవకుండా చర్యలు తీసుకున్నామని ప్రిన్సిపల్ పద్మావతి వివరించారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com