
క్షయ వ్యాధికి కొత్త మందు

క్షయవ్యాధిరి కొత్త వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీ, పంపిణీకి స్పెయిన్‌కు చెందిన బయోఫార్మాస్యూటికల్ కంపెనీ బయోఫాబ్రితో భారత్ బయోటెక్ చేతులు కలిపింది. ఇందులో భాగంగా ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికాకు చెందిన 70కి పైగా దేశాల్లో కొత్త వ్యాక్సిన్‌ను భారత్ బయో మార్కెటింగ్ చేస్తుంది.ప్రస్తుతం అందుబాటులో ఉన్న బీసీజీ వ్యాక్సిన్ పెద్దల్లో ఊపిరితిత్తుల సంబంధిత టీబీ నివారణలో అంత సమర్థవంతంగా లేదు. దీంతో కొత్త వ్యాక్సిన్ ‘ఎంటీబీవ్యాక్’ అవసరం ఏర్పడిందని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా చెప్పారు. కొత్త వ్యాక్సిన్‌పై చేసిన మొదటి, రెండో దశ క్లినికల్ పరీక్షలు మంచి ఫలితాలను ఇచ్చాయన్నారు. ఔషధాలకు స్పందించని టీబీ పెద్ద సమస్యగా మారుతోందని పేర్కొన్నారు. ఎంటీబీవ్యాక్పై మూడో దశ క్లినికల్ పరీక్షలు 2022 ద్వితీయార్ధంలో దక్షిణ ఆఫ్రికాలోని సెనెగల్, మడగాస్కర్లలో ప్రారంభమవుతాయి.
Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు