కాకినాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయులు మధుసూదన్ రావు జన్మదిన వేడుకలు


-హాజరైన పలువురు సీనియర్ పాత్రికేయులు

కాకినాడ జై ఆంధ్ర టీవీ ప్రతినిధి గణేష్: తూర్పు గోదావరి జిల్లాలోనే అత్యంత సీనియర్ పాత్రికేయులు, పత్రికా రంగానికి పితామహుడుగా ఉన్న తంగిశెట్టి మధుసూదన్ రావు 80వ జన్మదిన వేడుకలను కాకినాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్ అండ్ బి అతిథిగృహం నందు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా కాకినాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంకట శివరామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు సీనియర్ పాత్రికేయులు హాజరై మధుసూదన రావుతో ఉన్న అనుభవాన్ని పంచుకున్నారు. కాకినాడ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కోశాధికారి కృష్ణ, శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రులనుండి మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలపై ప్రశ్నలు ఏవిధంగా ప్రశ్నించవచ్చునో, జర్నలిజంలో ఉన్న విలువలను మధుసూదన్రావు ఇప్పటివరకు కాపాడుతూ వస్తున్నారన్నారు. 50 సంవత్సరాల సుధీర్ఘ అనుభవం ఉన్న జర్నలిజంలో ఏకైక వ్యక్తిగా మధుసూదన్రావు పేరుగాంచారన్ని, ఇంతటి వ్యక్తికి జన్మదిన వేడుకలను నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తంగిశెట్టి మధుసూదన రావు మాట్లాడుతూ ఈ జన్మదిన వేడుకలు తన జీవితంలో గుర్తుండిపోతాయని తన సీనియారిటీని తను ఒక జర్నలిస్టుగా కాకినాడ ప్రెస్ క్లబ్ గుర్తించిందని, జర్నలిజంలో ఉన్న విలువలను ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలని మనం రాసే వార్త సమాజానికి ఉపయోగపడాలే తప్ప ఏ వ్యక్తులను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదన్నారు. 50 ఏళ్ల సుదీర్ఘ జర్నలిజంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ అనేక ఆంగ్ల పత్రికలలో పని చేయడం జరిగిందని, రాష్ట్రస్థాయి అవార్డులను కూడా సొంతం చేసుకున్న వ్యక్తిగా తంగిశెట్టి ఉన్నారన్నారు. జిల్లాలో జరిగిన అమలాపురం బ్లౌవుట్ సంఘటన తనకు ఎంతో పేరు ప్రఖ్యాతులను తెచ్చిందని తెలిపారు. గతంలో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపినప్పటికీ కొన్ని ఆటంకాలు వలన అది జరగలేదని అతి త్వరలోనే ఇప్పుడు ఉన్న జర్నలిస్టులకు శిక్షణ తరగతులు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో బొడ్డు వెంకటరమణ, సాయినాథ్, సత్యంబాబు, వర్మ, మోహన్,నానాజీ, త్రినాథ్, స్వామి, రాంజీ, గోపీనాథ్, కరుణాకర్, శ్రీనివాస్, గణేష్, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com