ఉద్యోగాలును వెంటనే భర్తీ చేయాలని,నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్యాలి..BJYM రాష్ట్ర అధికార ప్రతినిధి తుల ఆంజనేయులు


భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ గారి పిలుపు మేరకు ఈరోజు మంచిర్యాల ఐబీ చౌరస్తాలో BJYM జిల్లా అధ్యక్షులు పట్టి క్రిష్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వం హామీ ఇచ్చినా రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని కోరుతూ అదేవిధంగా నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా BJYM రాష్ట్ర అధికార ప్రతినిధి తుల ఆంజనేయులు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలప్పుడు ఒక మాట ఎన్నికలు అయిపోయాక మరొక మాట మాట్లాడుతూ ఓటు రాజకీయాలకు తెలిపారని అన్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు హామీ ఇస్తూ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగుల ఓట్లు వేయించుకున్న కేసీఆర్ నేడు నీరుద్యోగులను విస్మరించారని మండిపడ్డారు. ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని మరొకసారి ఎన్నికల్లో ఆయన మాట ఇచ్చి నిరుద్యోగ యువతను నయ వంచనకు గురి చేశారని విమర్శలు చేశారు. హామీ ఇచ్చిన ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని అదేవిధంగా నిరుద్యోగ భృతి కూడా చెల్లించాలని నిరుద్యోగ యువత ఉద్యమం చేస్తుంటే వారి పైన అక్రమ కేసులు బనాయిస్తూ ప్రభుత్వం తమ నిరకుషత్వం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు.కేసీఆర్ ఇప్పటివరకు ప్రతి నిరుద్యోగికి 93,496 రూ లు బాకీ ఉన్నాడని తక్షణమే అవి చెల్లించాలని డిమాండ్ చేశారు. TRS నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.ప్రశించేవారిని అణచి వేయలని చూస్తే కేసీఆర్ ను తెలంగాణలో తిరగనేయమని నీ పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరిచారు.రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని బంగారు తెలంగాణ బిజెపి తోనే సాధ్యం అని స్పష్టం చేశారు..
ఈ కార్యక్రమంలో BJYM జిల్లా అధ్యక్షులు పట్టి కృష్ణ,జిల్లా ఉపధ్యక్షులు అమిరిశెట్టి రాజు,బొయిని దేవేందర్, జిల్లా అధికార ప్రతినిధి పల్లి రాకేష్,అసెంబ్లీ కన్వీనర్ రెడ్డిమళ్ళ అశోక్, కో కన్వీనర్ చక్రవర్తి, పట్టణ అధ్యక్షులు రాచకొండ సత్యనారాయణ, వివిధ మండలాల అధ్యక్షులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com