ఈటల రాజీనామాను ఆమోదించిన తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి


హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజీనామాను తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించారు. నేటి ఉదయం 11 గంటలకు ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి నేడు రాజీనామా చేశారు. గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్ళులర్పించిన అనంతరం అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మేట్‌లో ఉన్న తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. కాగా.. నేటి సాయంత్రం ఈటల ఢిల్లీ వెళ్లనున్నారు. 14న జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఈటల వర్గం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈటలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, రమేష్ రాథోడ్, తుల ఉమ, మరికొంతమంది నేతలు బీజేపీలో చేరనున్నారు. ఆర్టీసీ కార్మిక నేత అశ్వత్థామరెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉంది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com