
ఆమ్మో కొండచరియలు.. తప్పిన ప్రమాదం

ఉత్తరాఖండ్: కళ్లెదుటే లో కొండచరియ విరిగిపడింది, దింతో ముందే పసిగట్టడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఆర్మీ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని తవాఘాట్ దగ్గర ధార్చూలాలో జరిగింది. ఆర్మీ వాహనాలు వెళ్లేందుకు ఈ కొండ మార్గాన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. కొండల్లో ఏదో కదలిక కనిపించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆపేశారు. కొండచరియ విరిగి పడబోతోందని గ్రహించిన ఆర్మీ అధికారులు ఓపిగ్గా నిరీక్షించారు. అటు వెళ్లేందుకు ప్రయత్నించిన వాహనాలను విజిల్ వేసి మరీ ఆపారు. అంతలోనే రోడ్డువైపు ఉన్న కొండ భాగం కుప్పకూలింది. ఉత్తరాఖండ్ హిమాలయాల్లో ఇలా కొండచరియలు విరిగిపడడం తరచూ జరుగుతుంటుంది. అయితే ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరగడంతో పర్వతాల్లో కదలికలను ముందే గుర్తించగలుగుతున్నారు. దీంతో అక్కడ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు
Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు