అద్దెకు భార్యలు.. ఎక్కడ? ఆ ప్రాంతంలో అదో వింత దురాచారం!!!


మన దేశంలో స్త్రీ మూర్తిని పరమ పవిత్రంగా భావిస్తారు. శక్తి స్వరూపిణులుగా భావించి పూజలు చేస్తారు. అలాంటి సనాతన ధర్మ కలిగిన మన దేసంలో ఓ దురాచారం సాగుతోంది. అద్దె భార్యలు కూడా లభిస్తున్నారు. ఇలాంటి ఆచారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో సాగుతోంది. అంటే.. ఇక్కడ అమ్మాయిలు, మహిళలు అంటే.. అంగడి సరుకులతో సమాచానం. హేయమైన చర్య ఏంటంటే.. సొంత భర్తలే తమ భార్యలను పరాయి పురుషులకు డబ్బుకోసం అద్దెకిస్తుండటం గమనార్హం.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా, శివపురి గ్రామంలో ఇలాంటి దురాచారమే తరతరలుగా కొనసాగుతోంది. శివపురి ప్రాంతంలో గ్వాలియర్ రాజపుత్రులు నివశిస్తుంటారు. వీరిలో అనేకమంది డబ్బున్నవారు ఉన్నారు.వీరికోసం ఈ ప్రాంతంలో ఓ అనాచారమైన సౌకర్యం అందుబాటులో ఉంది.

అదేంటంటే ఆ ప్రాంతంలో ఉండే పేద మహిళల్లో తమకు నచ్చిన వారిని, నచ్చిన సమయంలో అద్దెకె తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ఆ పేద మహిళల కుటుంబాల్లో భర్తలు కూడా నిర్మొహమాటంగా అంగీకరిస్తారు. దీనికోసం వారికి కొంత మొత్తంలో నగదు కూడా లభిస్తుంది. ప్రతి ఏడాది సీజనల్‌గా నిర్వహించే ఈ దురాచారానికి ‘అడీచప్రద’ అని వారు పేరు పెట్టుకున్నారు. కూడా వారు పెట్టుకున్నారు.

ఈ దురాచారంలో అమ్మాయి అందానికి, వయసుకే ప్రాముఖ్యత. 16 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల మహిళలను ఇలా అద్దెకిస్తుంటారు వారి భర్తలు. అయితే దీనిపై మహిళల అభిప్రాయాలకు కానీ, వారి ఆత్మాభిమానానికి కానీ ఎలాంటి విలువ ఉండదు. ఆ మహిళకు నచ్చినా, నచ్చకున్నా కచ్చితంగా ఆమె సొమ్ము చెల్లించిన వ్యక్తితో వెళ్లిపోవలసిందే.
అమ్మాయి అందం, వయసును బట్టి, అద్దెకు తీసుకునే కాలాన్ని బట్టి 10 రూపాయల నుంచి లక్ష, రెండు లక్షల వరకు సదరు మహిళలకు ధర నిర్ణయిస్తుంటారు. దీనికోసం చట్టపరంగా స్టాంపు పేపర్లపై కూడా ఇరు పార్టీలు సంతకాలు చేసుకుని ఒప్పందం చేసుకుంటారు. ఈ విషయం మొత్తం అధికారులకు తెలిసినా ఏ మాత్రం పట్టించుకోరు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com