కరోనా వైరస్‌ క్రిములు 48 గంటల్లో ఖతం!


జై ఆంధ్ర టీవీ న్యూస్ డెస్క్:
కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్న ప్రపంచ దేశాలకు ఆస్ట్రేలియాకు చెందిన కొందరు పరిశోధకులు శుభవార్త చెప్పారు. అందుబాటులో ఉన్న యాంటి-పారాస్టిక్‌ డ్రగ్‌ ‘ఐవర్‌మెక్టిన్‌’తో కోవిడ్‌-19 ను ఎదుర్కోవచ్చని తెలిపారు. ఈమేరకు మోనాష్‌ యూనివర్సిటీ బయోమెడిసిన్‌ డిస్కవరీ ఇన్‌స్టిట్యూట్‌ (బీడీఐ), డోహెర్టీ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా నిర్వహించిన స్టడీలో వెల్లడైంది. హెచ్‌ఐవీ, జికా వైరస్‌, డెంగ్యూ, ఇన్‌ఫ్లూయెంజా వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఐవర్‌మెక్టిన్‌కు బాధితుని శరీరంలో నుంచి కరోనా వైరస్‌ క్రిములను పారదోలే శక్తి ఉందని స్టడీకి నేతృత్వం వహించిన డాక్టర్‌ కైలీ వాగ్‌స్టాఫ్‌ చెప్పారు.
ఆయన మాట్లాడుతూ.. ‘ఐవర్‌మెక్టిన్‌ అనే ఔషధం ఎఫ్‌డీఏ అనుమతి పొందిన డ్రగ్‌. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న ఔషదం. ఎంతో సురక్షితమైన డ్రగ్‌ కూడా. పలు వైరల్‌ ఫీవర్లపై ఐవర్‌మెక్టిన్‌ ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనితో మానవ శరీరంలో సెల్‌ సంస్కృతిలో పెరుగుతున్న కోవిడ్‌-19 వ్యాప్తిని అడ్డుకోవచ్చని మా పరిశోధనలో తేలింది. ఈ మెడిసిన్‌ సింగిల్‌​ డోస్‌ ద్వారా బాధితుని శరీరంలోని వైరల్‌ ఆర్‌ఎన్‌ఏను 48 గంటల్లో తొలగించవచ్చు. అంటే ఒక్క డోస్‌తో 24 గంటల్లో ​మెరుగైన ఫలితాలు వస్తాయి. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా చాలా సమయం పట్టనుంది. కాబట్టి, అందుబాటులో ఉన్న ఈమెడిసిన్‌తో చికిత్స చేస్తే మంచిది’అని వాగ్‌స్టాఫ్‌ పేర్కొన్నారు. అయితే, ల్యాబ్‌ దశలో విజయవంతం అయిన తమ పరీక్షలను మనుషులపై క్లినియల్‌ ట్రయల్స్‌ చేయాల్సి ఉందని ఆయన వెల్లడించారు. తమ అధ్యయన వివరాలు యాంటి వైరల్‌ రిసెర్చ్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయని తెలిపారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com