తీహార్ జైల్లో నిర్భయ దోషులకు ఉరి అమలు


ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.!
నిర్భయ దోషులకు...ఉరి అమలు చేశారు

నిర్భయను 2012లో కిరాతకంగా అత్యాచారం చేసి.. ఆమె చావుకు కారణమైన నిర్భయ దోషులు వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ థాకుర్, ముఖేష్ సింగ్‌లకు ఎట్టకేలకు శుక్రవారం ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ఉరి శిక్ష అమలయింది. జైలు అధికారులు నలుగురినీ ఒకేసారి ఉరి తీశారు. తీహార్ జైలులోని రూం నెంబర్ 3లో నలుగురు దోషులకు శిక్షను అమలు చేశారు. ఆ సమయంలో ఉరి కంబం దగ్గర 48 గార్డులు విధి నిర్వహణలో ఉన్నారు. అంటే ఒక్కోక్క దోషికి 12 మంది గార్డులను ఏర్పాటు చేశారు. దోషులను ఉరి తీయడానికి ముందు డాక్టర్ల చేత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 4 గంటలకు నలుగురికీ అల్పాహారం ఇచ్చారు. అయితే ఉరి తీసే ముందు దోషి వినయ్ శర్మ బోరున విలపించాడు. కాగా.. నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయడం దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి. శిక్ష అమలు తర్వాత వైద్యులు దోషల మృతదేహాలను పరిశీలించి చనిపోయారని నిర్దారించారు. ఉదయం 8 గంటలకు వారి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఆ తర్వాత మృతదేహాలను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తారు. నిర్భయ తల్లిదండ్రులు ఇన్నాళ్లకు తమకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన 7 ఏళ్ల తర్వాత న్యాయం జరిగింది. తీహార్ జైలు బయట ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారుఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ దోషులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
చివరికి సర్వోన్నత న్యాయస్థానంలోనూ వారికి చుక్కెదురైంది. ఉరిశిక్షను యథాతథంగా అమలు చేయాలన్న దిల్లీహైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేయగా.. సర్వోన్నత న్యాయస్థానం దానిని కొట్టివేసింది.జస్టిస్‌ ఆర్‌. భానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ బోపన్నల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. దీంతో ఉదయం 5.30 గంటలకు నిర్భయ దోషులను ఉరి తీయనున్నారు. నిర్భయ దోషులను కలిసేందుకు కుటుంబ సభ్యులకు 5-10 నిమిషాలు అనుమతివ్వాలని వారి తరఫు న్యాయవాది ఎ.పి.సింగ్‌ కోరారు. దీనిపై సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ దీనికి జైలు నియమాలు అనుమతించవని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పుపట్ల నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. దోషులకు ఉరిశిక్షతో నిర్భయ ఆత్మశాంతిస్తుందని అన్నారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com