హోం మినిస్టర్ ఆ ? లేక డిప్యూటీ సీఎం ఆ ? @ పితాని సత్యనారాయణ..


ఉభయగోదావరి జిల్లాలు ప్రశాంతతకు మారుపేరు... 2014 ఎన్నికలలో టిడిపి కి అధికారాన్ని కట్టబెట్టాయి అంటే కేవలం ఈ ఉభయగోదావరి జిల్లాల వల్ల మాత్రమే.ఈ ఉభయగోదావరి జిల్లా తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తనకంటూ ఒక గుర్తింపు, నలుగురికి సహాయం చేసే వ్యక్తి, బిసిలకు కోసం నిరంతరం పోరాటం చేస్తూ, బిసి హక్కులకు సాధనకై నిరంతరం కృషి చేసే ఏకైక వ్యక్తి మనందరికీ సుపరిచితుడు మంత్రి పితాని గురించి జై ఆంధ్ర టీవీ సంక్లుప్తంగా అందిస్తున్న కధనం...
ప్రస్తుత రాజకీయాలు అంటే సంపాదించుకోవడం, సంపాదించింది కాపాడుకోవడం,ఇదే మనందరికీ తెలిసిన సామెత..కానీ తాతలు,తండ్రి సంపాదించినా ఆస్తిని రాజకీయాల్లో తన ప్రజలకోసం, తన చేసిన అప్పులు తీర్చడానికి అమ్ముకుంటున్న వ్యక్తి ఉన్నారు అంటే ఎవరైనా నమ్ముతారా ?
కచ్చితంగా ప్రతి ఒక్కరు నమ్మాలి.. ఎందుకంటే ఆచంట నియోజకవర్గం, పెనుగొండ నియోజకవర్గాల నుండి మూడుసార్లు ఎమ్మెల్యే గా గెలిచి , మూడు సార్లు మంత్రి పదవి చేసి కూడా ఏమి సంపాదించుకోకుండా, ఉన్న ఆస్తిని నేటికీ అమ్ముకుంటున్న ఏకైక వ్యక్తి మంత్రి పితాని సత్యనారాయణ.పాలకోలు లో పితానికి ఉన్న ఆఫీస్ కార్యాలయాన్ని , పెనుగొండలో ఉన్న తన వ్యవసాయ భూమిని , 2017 సంవత్సరం లో ఏలేటిపాడులో తనకున్న మరొక వ్యవసాయ భూమిని సైతం అమ్ముకున్న వ్యక్తి పితాని . కష్టం అని తన ఇంటి మెట్టు ఎక్కిన ప్రతి ఒక్కరికి, పార్టీలతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజలు మన వాళ్లే అని భావించే వ్యక్తి మంత్రి పితాని సత్యనారాయణ..తన సొంత డబ్బును తనను నమ్ముకున్న, ప్రజల కోసం నిరంతరం ఖర్చు చేస్తూ ముందుకు సాగుతున్న వ్యక్తి మంత్రి పితాని.
తన నియోజకవర్గం లో ప్రమాదవశాత్తు మరణించిన ,గాయపడిన కానీ, పేదలు వైద్య చికిత్సలు చేయించుకోలేని వారికీ ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి మంత్రి పితాని.. కానీ ఇప్పటివరకు తను అనేక ఆర్ధిక సహాయాలను చేసిన ఎటువంటి పబ్లిసిటీని ఇష్టపడకుండా ముందుకుసాగుతున్న ఏకైక వ్యక్తి పితాని సత్యనారాయణ ...
ఏప్రిల్ 11 న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పితాని సత్యనారాయణ పై వైకాపా నుండి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు పోటీ చేస్తున్నారు. మంత్రి పితాని పై గెలవడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర కృషి చేస్తుంది...అయితే మంత్రి పితానిపై గెలుపు కోసం అత్యంత ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తి శ్రీ రంగనాధరాజును పోటీలోకి దింపింది,,
వాస్తవ పరిస్తుతులను అన్వేషిస్తే శ్రీ రంగనాధరాజు మంత్రి పితాని కంటే 100 రేట్లు ఆర్థికంగా బలమైన వ్యక్తి..కానీ శ్రీ రంగనాధరాజు గతం లో అత్తిలి నియోకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచారు.తన గెలుపుకోసం నిరంతరం కృషి చేసిన ''రెడ్డి కులస్తులను ''ఎన్నికలు అయినా తరువాత అణిచి వేశారు , కొన్ని సందర్భాల్లో రెడ్డి కులస్తులు అంటే తనకు అసహ్యం అన్న సందర్భాలు కూడా ఉన్నాయి .కనీసం సామాన్య ప్రజలకు శ్రీ రంగనాధరాజు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉన్న సందర్భాలు లేనేలేవు.
శ్రీ రంగనాధరాజును సామాన్య ప్రజలు కలవాలంటే అది ఒక అందని ద్రాక్ష అని చెప్పవచ్చు. రంగనాధరాజును కలిసే కంటే రాష్ట్ర ముఖ్య మంత్రి ని కలవడం సులభమని అత్తిలి ప్రజలు జై ఆంధ్ర టీవీ కి తెలిపారు.అయితే ప్రస్తుతం రంగనాధరాజు ఓట్లు సంపాదించుకోవడం కోసం ప్రజలపై కపట ప్రేమను, కపట మర్యాదను ప్రదర్శిస్తున్నారని ఆచంట ప్రజలు గుసగుసలాడుతున్నారు.తన డబ్బును నియోజకవర్గం కోసం ఖర్చు చేసి విపిరితమైన పబ్లిసిటీని కోరుకునే వ్యక్తి శ్రీ రంగనాధరాజు అని చెప్పవచ్చు.తనకు అనుకూలంగా ఉన్న పత్రికల్లో చేసేది గోరంత-పబ్లిసిటీ మాత్రం కొండంత అన్నట్లు చూపిస్తారు.
రంగనాధరాజు గెలిస్తే కనుక బిసి ప్రజలను,రెడ్డి కులస్తులను అణిచివేయడం జరగడం తథ్యం అని రంగనాధరాజు అత్యంత సన్నితులు, బాహాటంగానే ప్రకటిస్తున్నారు.
అయితే మంత్రి పితాని ని పరిశీలించినట్లయితే ఉదయం 6 : 30 నుండి ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా వారి కష్టాలను తన వ్యక్తి గత కార్యదర్సులు లేకుండానే తానే స్వయంగా పరిష్కరిస్తున్న సందర్భాలు ఎన్నో జై ఆంధ్ర టీవీ కంట పడ్డాయి..ఎటువంటి సెక్యూరిటీ , హడావిడి లేకుండా ప్రజలకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్న వ్యక్తి పితాని,, ఎన్నికలతో సంబంధం లేకుండా గత 25 సంవత్సరాలగా తన ప్రజల ఇంట్లో వచ్చే కష్ట సుఖాల్లో కుటుంబ సమేతంగా పాల్గొనే వ్యక్తి మంత్రి పితాని.ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా ,అత్యంత సన్నితులుగా పలకరించి , ఒక్కసారి పరిచయం అయితే వారిని గుర్తుంచుకునే నైజం కలిగిన వ్యక్తి మంత్రి పితాని..
అయితే ఇక్కడ పరిస్తుతులను గమనిస్తే ఆచంట నియోజకవర్గ ప్రజలు పితాని సత్యనారాయణ వైపే మొగ్గు చూపిస్తున్నారు, మంత్రి పితాని గెలవడం ఖాయమని నియోజవర్గ ప్రజలు భావిస్తున్నారు.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో పితాని గెలిస్తే ఆచంట నియోకవర్గ రూపురేఖలు మారిపోవడమే కాకుండా, రాష్ట్ర బిసి ప్రజలు అత్యంత ఉన్నత స్థాయికి చేరుకోవడమే కాకుండా వారి హక్కులు ,వారి కళలు నెరవేరనున్నాయి.ఈ సారి పితాని గెలిస్తే రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కాకుండా మరొక కీలక శాఖ పితాని సత్యనారాయణకు దక్కనున్నది.
ప్రజలు కపట ప్రేమను, కపట దానాలను కోరుకుంటారా ? లేదా నిరంతరం అభివృద్ధిని ప్రజల మనిషి అయినటువంటి పితాని సత్యనారాయణను కోరుకుంటారో వేచి చూద్దాం...
కధనం:TDR

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com