నిడదవోలు నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఉండే ఏకైక నేతగా కుందుల సత్యనారాయణ ..


2014 ఎన్నికల్లో తూర్పు ,పశ్చిమ గోదావరి జిల్లాలే తెలుగుదేశం పార్టీని అధికారం లోకి తీసుకొచ్చింది , ప.గో జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాలేదంటే తెలుగుదేశం పార్టీ కి ఎంత పట్టు ఉందొ ఆలోచించుకోవచ్చు.అయితే రానున్న సార్వత్రిక ఎన్నికలకు నిడదవోలు నియోజకవర్గానికి ఇద్దరు నేతలు పోటీపడుతున్నారు.ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పై సొంత తెలుగుదేశం కార్యకర్తల్లోని తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కుంటున్న పరిస్థితి నెలకొనింది.అయితే బూరుగు పల్లి శేషారావు చేస్తున్న అవినీతికి హద్దు అదుపు లేకుండా పోయిందని సొంత కార్యకర్తలకు పనులు చేయాలంటే భారీ స్థాయిలో ముడుపులు చెల్లించవలసి వస్తుందని ,ముడుపులు చెల్లించని పక్షం లో వారికీ ఎట్టి పరిస్థితిల్లో ఆ పని జరగదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుస గుసలాడుతున్నారు . అక్రమ ఇసుక మాఫియా కి కేర్ అఫ్ అడ్రెస్స్ గా బూరుగుపల్లి శేషారావు ఆఫీస్ మారిందని, అలాగే లిక్కర్ సిండికేట్ నుండి ప్రతి నెల మాములు ఎల్లని పక్షం లో ఆ లిక్కర్ షాప్ యాజమాన్యం పై ఎక్సయిజ్ మరియు పోలీస్ శాఖల నుండి ఇబ్బందులు తప్పడం లేదు .వైసిపి కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం ,వారు దరఖాస్తు చేసుకున్న ప్రభుత్వ సంక్షేమ పధకాలను అందకుండా చేస్తున్నారని అలాగే వైసిపి కార్యకర్తలను పోలీస్ పవర్ ను వాడుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని , వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు.
అయితే ఇదే నియోజకవర్గం లో టిడిపి కి ప్రత్యాన్మాయ నాయకుడుగా కుందుల సత్యనారాయణ ఉన్నారు.ప్రస్తుత ఎమ్మెల్యే శేషారావు గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి గెలుపుని అందించారు . రాత్రి పగలు ఉడ్రాజవరం ,పెరవలి మండలాల్లో పర్యటిస్తూ శేషారావు విజయానికి కృషి చేసారు..అయితే బూరుగుపల్లి శేషారావుఎమ్మెల్యే అయినప్పటి నుండి శేషారావు తనకు మద్దతు ఇచ్చిన కుందుల సత్యనారాయణను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేసారని, అలాగే కుందుల సత్యనారాయణ పై అనేక అసత్య ప్రచారాలను చేయించారని టిడిపి కార్యకర్తలు గుసగుసలు ఆడుతున్నారు . అయితే కుందుల సత్యనారాయణను దగ్గర్నుండి చుసిన ప్రతి ఒక్కరు నాయకుడంటే కందులలా ఉండాలని సహాయం కావాలని ఏ పార్టీ వారు వెళ్లిన వారికీ నేనున్నానని భరోసా ఇవ్వడమే కాకుండా ,వెంటనే సహాయం చేసే నాయకుడని అలాగే ఇళ్లు కట్టుకుంటున్న ఎంతో మంది పేద ప్రజలకు ఎటువంటి లాభం ఆశించకుండా సహాయం చేసిన నేత కుందుల సత్యనారాయణ అని , అయన వల్ల లబ్ది పొందిన ఏ.శివ శంకర్ జై ఆంధ్ర టీవీ కి వెల్లడించారు . కుందుల సత్యనారాయణ ప్రతి పేదవాడి కష్టం ఆయనికి తెలుసనీ , ఎన్నోకష్టాలు అనుభవించి, వ్యాపారం లో వడిదుడుకులు ఎదుర్కొని నేడు ఈ స్థాయికి చేరుకున్నారని , ప్రజలకు సేవ చేయడమే అయన ముఖ్య ఉద్దేశ్యం అని నిడదవోలు పట్టణానికి చెందిన గూడవల్లి మృత్యుంజయరావు అన్నారు.కుందుల సత్యనారాయణ 2019 ఎన్నికల్లో ఏ పార్టీ నుండి పోటీ చేసిన, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పార్టీ కి పతనం తప్పదని , ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ శేషారావు , మరియు శేషారావు కుటుంబ సభ్యులకు తెలుగుదేశం సీటు ఇవ్వకూడదని, ఇస్తే దొంగ చేతికి తాళం ఇచ్చిన పరిస్థితి ఏర్పడుతుందని నిడదవోలు పట్టణానికి చెందిన అసమ్మతి వర్గం జై ఆంధ్ర టీవీ తో పేర్కొంది.
ఏది ఏమైనా ప్రజల మనస్సు,పార్టీ ఆదేశాలను శిరసా వహిస్తూ నిత్యం ప్రజలతో ఉండే కుందుల సత్యనారాయణకు సీటు కేటాయించాలని నియోకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు .

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com