స్వలింగ సంపర్కులకు ప్రవేశం లేదంటూ.. ఓ మసాజ్ సెంటర్ యజమాని..


అది కపుల్స్‌ కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మసాజ్ సెంటర్. నిత్యం వందలాది జంటలు అక్కడ మసాజ్ చేయించుకోడానికి వస్తూంటారు. అదే మసాజ్ సెంటర్‌కు సోమవారం ఒక గే జంట కూడా వెళ్లింది. అయితే మసాజ్ సెంటర్ యజమాని వారికి మసాజ్‌ను నిరాకరించాడు. స్త్రీ, పురుషుల కోసం తాను ఈ సెంటర్‌ను నడుపుతున్నానని.. స్వలింగ సంపర్కుల కోసం కాదని వారికి చెప్పి పంపేశాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆ జంట అక్కడ జరిగిన సంభాషణను మసాజ్ సెంటర్ ఫేస్‌బుక్‌ పేజ‌్‌లో పోస్ట్ చేశారు. తాము కూడా అందరిలా మనుషులమేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మసాజ్ సెంటర్ యజమాని స్పందించాడు. గే జంటకు క్షమాపణలు చెప్పడమే కాకుండా ఉచితంగా గంటపాటు మసాజ్ చేయించుకోవచ్చంటూ పోస్ట్ పెట్టాడు. ఉచితంగా తమకు ఏం అవసరం లేదని తమను కూడా అందరిలా చూడాలని ఆ జంట కామెంట్ చేసింది. కాగా, మసాజ్ సెంటర్ యజమాని చట్టానికి వ్యతిరేకంగా ఏం చేయలేదు. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com