మన పిల్లల బాధలు వర్ణనాతీతం!
తెలుగు విద్యార్థుల కోసం వేటాడుతున్న అమెరికా
అమెరికన్ జైళ్లలో ఇంకా 100 మంది తిండి పడక నీరసిస్తున్న యువత
బెయిలొచ్చినా కోర్టు తేదీల కోసం ఎదురుచూపులు
ఖర్చులకు డబ్బుల్లేవు.. సాయం అంతంతమాత్రం
డెట్రాయిట్:అమెరికా జైళ్లలో మన పిల్లలు మగ్గిపోతున్నారు. సరైన తిండి లభించక శుష్కించిపోతున్నారు. డబ్బు లేక న్యాయసహాయం అందక అల్లాడిపోతున్నారు. కఠోరమైన ఈ నిజం మన పాలకులను కదిలించలేకపోతోంది...
ఫార్మింగ్టన్ నకిలీ విశ్వవిద్యాలయ బాగోతంలో ఈ జనవరిలో 130 మంది అరెస్టయిన సంగతి తెలిసిందే. మొత్తం 600 మంది చట్టవిరుద్ధంగా ఆ వర్సిటీలో నమోదు చేసుకున్నాక ఆంతరంగిక భద్రతా విభాగం (డీహెచ్ఎస్) అకస్మాత్తుగా - ఆ విశ్వవిద్యాలయం ఒట్టి బోగస్ అనీ, అక్రమ వీసాలతో అమెరికాలో తిష్టవేయడానికి ప్రయత్నించిన వారిని ఏరివెయ్యడానికి తామే దానిని సృష్టించామని ప్రకటించింది. ఆ వెంటనే అందులో నమోదు చేసుకున్న 130 మందిని అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్లలో పెట్టింది. ఫిబ్రవరి 19 నాటికి ఆ సంఖ్య 161కి పెరిగింది. వీరిలో 11 మంది మహిళలు. వీరంతా ఆ జైళ్లలోనే ఉన్నారు.
‘‘మాకు తెలిసిన సమాచారం ప్రకారం 14 మంది విడుదలై ఇండియాకు తిరిగి వెళ్లిపోయారు. 32 మందికి స్వచ్ఛందంగా వెళ్లిపోవడానికి ఇమిగ్రేషన్ కోర్టుల అనుమతి లభించింది. వారు నేడో రేపో తిరిగి వెళ్లిపోతారు. 18 మందికి బెయిల్ మంజూరైనా వారు కోర్టులో హాజరవడానికి ఇంకా తేదీ చెప్పలేదు. కోర్టు నిర్ణయం కోసం వారు ఎదురుచూస్తున్నారు. మిగిలిన దాదాపు 100 మంది జైళ్లలోనే మగ్గుతున్నారు’’ అని ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) మీడియా కోఆర్డినేటర్ సాగర్ దొడ్డపనేని ‘జై ఆంధ్ర టీవీ ’ కి చెప్పారు. తమ సంస్థ తరఫున ఇప్పటిదాకా 52 మందిని కాంటాక్ట్ చేసి న్యాయసహాయం, ఆర్థికసాయం అందించినట్లు ఆయన తెలిపారు.
‘‘పలువురు విద్యార్థుల పరిస్థితి డిటెన్షన్ సెంటర్లలో ఘోరంగా ఉంది. దేశవ్యాప్తంగా 34 డిటెన్షన్ సెంటర్లలో వారిని నిర్బంధించారు. వీరిలో చాలామంది శాకాహారులు కావడంతో సరైన తిండి దొరక్క నీరసించిపోయారు’’ అని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అధ్యక్షుడు పరమేశ్ భీంరెడ్డి చెప్పారు. ‘‘బాధిత విద్యార్థుల్లో అనేకమంది దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు.. బ్యాంకు రుణాలు తీసుకుని ఇక్కడికి వచ్చారు.. ఈ యువతీయువకులంతా అమాయకులు. వారేమీ నేరస్థులు కారు. శారీరకంగా, మానసికంగా ఎంతో వేదనకు గురవుతున్నారు’’ అని పరమేశ్ పేర్కొన్నారు.
‘‘మొత్తం 600 మందిలో మెజారిటీ విద్యార్థులు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే. 160 మంది అరెస్ట్ కాగా మిగిలిన 440 మందీ తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నా అవకాశాలు తెలియక అయోమయ స్థితిలో ఉన్నారు. వారిలో అనేకులు అరెస్టు భయంతో తాము ఇచ్చిన చిరునామాలను కాదని వేరే చోట తలదాచుకుంటున్నారు. వారి కోసం అమెరికన్ పోలీసులు, ఇమిగ్రేషన్ అధికారులు వేటాడుతున్నారు. ఎవరెవరో ఎక్కడెక్కడో అరెస్టవుతున్నారు. వారిని ట్రాక్ చెయ్యడం గగనమైపోతోంది’’ అని తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు వెల్లడించినట్లు డెట్రాయిట్ ఫ్రీ ప్రెస్ ఓ వార్తాకథనంలో తెలిపింది. ‘‘కొందరు అక్రమంగా క్యాబ్ డ్రైవర్లుగా పని చేసుకుంటున్నారు. ఎవరు సాయం చేస్తామన్నా, ఏ పని ఇస్తామన్నా కుదురుకుంటున్న వారెందరో ఒహాయో, డెట్రాయిట్, కాలిఫోర్నియా, అట్లాంటా, న్యూజెర్సీ లాంటి నగరాల్లో ఉన్నారు’’ అని సాగర్ చెప్పారు.

Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు