తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో షాక్.. టీఆర్‌ఎస్‌లోకి సబితాఇంద్రారెడ్డి?


లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రేపోమాపో విడుదల కానున్న నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కాంగ్రెస్ కీలక నేతలపై టీఆర్‌ఎస్ గురి పెట్టింది. ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌లో ఆమె చేరేందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలిసింది. అసదుద్దీన్‌ నివాసంలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి భేటీ అయినట్లు సమాచారం. రెండు రోజుల్లో కేసీఆర్‌తో సబితాఇంద్రారెడ్డి భేటీ కానున్నట్లు తెలిసింది.

చర్చలు సఫలమైతే చేవెళ్ల ఎంపీ స్థానం నుంచి సబితాఇంద్రారెడ్డి గానీ ఆమె కుమారుడు గానీ టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్‌లో చేరుతామని ఎమ్మెల్యేలు సండ్ర, ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. రేపు టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ కీలక సమావేశానికి కేసీఆర్ హాజరుకానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్ మాక్ పోలింగ్ నిర్వహించున్నట్లు తెలిసింది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com