విమానం కూలి 14 మంది దుర్మరణం


సెంట్రల్ కొలంబియాలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక విమానం కూలిపోవడంతో 14 మంది మృతి చెందారు. 30 సీట్ల సామర్థ్యం కలిగిన డగ్లస్ డీసీ-3 విమానం విల్లావెసెన్కో నుంచి టరైరాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 120 కిలోమీటర్ల ఈ మార్గంలో 75 మైళ్లు ప్రయాణించిన విమానం శాన్ జోస్ డెల్ గౌవైరో, విల్లావెసెన్సియా పట్టణాల మధ్య కుప్పకూలినట్టు అధికారులు తెలిపారు. కంట్రోల్ రూమ్‌తో సంబంధాలు తెగిపోయిన గంటసేపు తర్వాత విమాన శకలాలను కనుగొన్నామని, ప్రమాద కారణాలు ఇంకా తెలియలేదని చెప్పారు. వాతావరణ ప్రతికూలత, ఇంజన్‌‌లో తలెత్తిన సాంకేతిక సమస్య ప్రమాదానికి కారణాలు కావచ్చని అనుమానిస్తున్నారు. విమానం కూలిపోయిన వెంటనే పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఎవరూ బతికి బయటపడలేదని, మృతులను గుర్తించే ప్రక్రియ చేపట్టామని కొలంబియా అధికారులు తెలిపారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com