మంచి నీళ్ళ కన్నా తక్కువ ధరకే పాలు


మహారాష్ట్ర పాడి రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. ఆవులు, గేదెలను పోషిస్తూ, పాల అమ్మకం ద్వారా జీవనోపాధిని పొందుతున్నవారు నష్టాల్లో కూరుకుపోతున్నారు. పాల ఉత్పత్తి ఎంతగా పెరిగిందంటే, గత నవంబరు నుంచి రోజుకు 22 లక్షల లీటర్ల పాలు మిగిలిపోతున్నాయి. దీంతో పాల సేకరణ ధర తగ్గింది. ఆవులు, గేదెల కోసం రోజుకు రూ.1,000 ఖర్చయితే, ఆ రైతు పొందుతున్నది రూ.720 మాత్రమే. దీంతో పాలను నమ్ముకున్నవారు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం స్పందించాలంటూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ నిరసనను తెలిపేందుకు పాలను రోడ్లపై పోస్తున్నారు.

ఓ రైతు మాట్లాడుతూ తాను రోజుకు 40 లీటర్ల పాలు అమ్ముతానని, తనకు లీటరుకు రూ.17 చొప్పున మాత్రమే లభిస్తోందని చెప్పారు. గతంలో నెలకు రూ.15 వేలు వరకు లాభాలు వచ్చేవని, ఇప్పుడు నెలకు రూ.9 వేలు నష్టపోతున్నానని చెప్పారు. వాటర్ బాటిల్ ధర కనీసం రూ.20 ఉంటోందని, పాల ధర మాత్రం చాలా తక్కువగా ఉందని చెప్పారు.
మహారాష్ట్రలో రోజుకు 115 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. గత ఏడాది జూన్‌లో సేకరణ ధరను లీటరుకు రూ.24 నుంచి రూ.27కు ప్రభుత్వం పెంచింది. అయితే కొద్ది నెలల్లోనే ఈ ధర తగ్గిపోయింది. దీనికి కారణాలు ఏమిటంటే, రోజుకు 22 లక్షల లీటర్ల పాలు మిగిలే విధంగా ఉత్పత్తి జరుగుతుండటంతోపాటు అంతర్జాతీయ స్కిమ్డ్ మిల్క్ పౌండర్ ధరలు 30 శాతం నుంచి 40 శాతం తగ్గిపోవడం అని చెప్పవచ్చు. డెయిరీలు తమ వద్దనున్న మిల్క్ పౌడర్‌ను అమ్ముకోలేక నష్టపోతున్నాయి.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com