పవిత్రసంగమం ఘాట్‌లో ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్


విజయవాడ ఇబ్రహీంపట్నం పవిత్రసంగమం వద్ద రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. పవిత్ర సంగమం వద్ద స్నానానికి దిగిన నలుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు నిన్న సాయంత్రం గల్లంతైన సంగతి తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన గురజాల సాయిరామ్‌, గుంటూరు జిల్లా ఒట్టిచెరుకూరు మండలం సౌపాడు గ్రామానికి చెందిన కారుకుట్ల ప్రవీణ్‌, కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలం రంగాపురం గ్రామానికి చెందిన కుప్పిరెడ్డి నాగకృష్ణ చైతన్య రెడ్డి, విజయవాడ పంజా సెంటర్‌కు చెందిన పిల్లా రాజ్‌కుమార్‌, కృష్ణాజిల్లా నడింతిరువూరుకు చెందిన నర్సింగ్‌ త్రినాథ్‌లు కంచికర్లలో గల దేవినేని వెంకటరమణ అండ్‌ డాక్టర్‌ హిమశేఖర్‌ మిక్‌ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదువుతున్నారు. వీరిలో సాయిరామ్‌, ప్రవీణ్‌, రాజ్‌కుమార్‌ మెకానికల్‌ రెండో సంవత్సరం, శ్రీనాథ్‌, నాగకృష్ణ చైతన్యరెడ్డి సివిల్‌ రెండో సంవత్సరం చదువుతున్నారు. శనివారం కళాశాల ఉన్నప్పటికీ సరదాగా బయటకు వెళ్లాలనుకొన్నారు. పట్టిసీమ నుంచి వచ్చే గోదావరి ప్రవాహాన్ని చూడడానికి బయలుదేరారు. శ్రీనాథ్‌, ప్రవీణ్‌, రాజ్‌కుమార్‌, నాగకృష్ణ చైతన్యరెడ్డి స్నానం చేయడానికి నీళ్లలోకి దిగారు. సాయిరామ్‌ మాత్రం ఘాట్‌ దగ్గరే ఉండిపోయాడు. ఘాట్‌కు కొంతదూరంలో నీళ్ల మధ్య ఏర్పాటు చేసిన ఇనుప రెయిలింగ్‌ను శ్రీనాథ్‌ సరదాగా ఎక్కాడు. అదుపు తప్పడంతో వెనక్కి పడిపోయాడు. అక్కడ లోతు ఎక్కువగా ఉండటం, గోదావరి ప్రవాహం ఉధృతమవడంతో శ్రీనాథ్‌ కొట్టుకుపోయాడు. అతణ్ణి కాపాడే ప్రయత్నంలో ప్రవీణ్‌, రాజ్‌కుమార్‌, నాగకృష్ణ చైతన్యరెడ్డి రెయిలింగ్‌ దాటారు. దీంతో వారు కూడా గల్లంతయ్యారు. కాగా... అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టగా ముగ్గురి మతదేహాలు లభ్యమైనట్లు తెలుస్తుండగా మరొకరి కోసం వెతుకుతున్నారు. విశాఖ నుంచి వచ్చిన ఆరుగురు గజ ఈతగాళ్లు, 12 ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com