అధినేత మదిలో ఆ ముగ్గురెవరో!?


అధికారంపై మరోసారి కన్నేసిన టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం, సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా గెలుపు గుర్రాల వేట మొదలుపెట్టిందా? దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికల వాతావరణం నెలకొనడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ దిశగా కసరత్తు ప్రారంభించారా? విశ్వసనీయ సమాచారం ప్రకారం, పై రెండు ప్రశ్నలకూ పార్టీ వర్గాల నుంచి ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తోంది. ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాల్లో తాజా పరిస్థితులు, ఇతర బలమైన అభ్యర్థులపై ఇప్పటికే పలు సర్వేలు చేయించిన సీఎం, ఆయా నివేదికలను ఆసరగా చేసుకొని అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. పక్కాగా గెలుస్తారనే విశ్వాసమున్న అభ్యర్థుల పేర్లతో ఆగస్టులో మొదటి జాబితా వెల్లడికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. గతంలో సిట్టింగులకు సీట్లు ఖాయమని చెప్పిన ముఖ్యమంత్రి, ఆ తర్వాత మనసు మార్చుకున్నట్లు పలు సందర్భాల్లో బయటపడింది. ప్రస్తుతం జిల్లాలోని మూడు నియోజవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉండగా, వివిధ సర్వేల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ తరుణంలో ఆ ముగ్గురికీ టికెట్లు దక్కుతాయా? ఒకవేళ ఎవరినైనా పక్కన పెడితే ప్రత్యామ్నాయ నాయకులెవరు? వారిలో ఎవరిని అదృష్టం వరించనుంది? ఇలాంటి అనేక ప్రశ్నలు జిల్లావాసుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి.

ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో జిల్లాలో రాజకీయవాతావరణం ఒక్కసా రిగా వేడెక్కింది. దీనికి తోడు ముఖ్యమంత్రి కేసీఆర్‌, అధికారపార్టీలో అభ్యర్థులను ఖరా రుచేసే ప్రక్రియను వేగవంతం చేసినట్లు వా ర్తలు వెలువడుతున్నాయి. వచ్చే ఎన్నికల కోసం కొంతమంది అభ్యర్థుల పేర్లను ముందే ప్రక టించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గతంలో సిట్టింగులందరికీ సీట్లు ఇస్తానని చెప్పి న సీఎం, ఆ తర్వాత మనసు మార్చుకున్నట్లు వివిధ సందర్భాల్లో ఆయన మాటలను బట్టి బయటపడింది. ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న అభ్యర్థులతో ఎన్నికలకు వెళ్తే సమస్యలను కొని తెచ్చుకున్నట్లేననే అభిప్రాయంతోనే ఆయన ఇంటెలిజెన్స్‌తో పాటు పలు ప్రైవేట్‌ ఏజెన్సీల ద్వారా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయిం చారని భావిస్తున్నారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆయా నివేదికలను వడబోయడమే గాక ఏ అసెంబ్లీ స్థానంలో ఏ అభ్యర్థికి టికెట్‌ కేటా యించాలనే విషయంలో ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఆగస్టు 15 తర్వాత 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో సగం స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలు స్తోంది. పక్కాగా గెలుస్తారనే అభ్యర్థులకు మొదటి జాబితాలో చోటు లభిస్తుందని చెబుతుండగా, అందులో జిల్లా ఎమ్మెల్యేలు ఉంటారా? ఉండరా? ఉంటే ఎవరెవరు? అనేది చర్చనీ యాంశంగా మారింది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com