రోడ్డు ప్రమాదంలో మూడేళ్ళ బాలుడు మృతి


గీసుగొండ మండలంలోని కొమ్మాల వద్ద వరంగల్‌-నర్సంపేట ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మణ్‌(3) అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం... కొమ్మాల గ్రామానికి చెం దిన బానోతు జగన్‌-కవిత దంపతులకు రామ్‌, లక్ష్మణ్‌ అనే కవల పిల్లలు ఉన్నారు. అయితే... వ్యవసాయ భూమిలో పత్తి విత్తనాలు నాటి ఇంటికి వస్తున్న తల్లి కవితను చూసి లక్ష్మణ్‌ రోడ్డు ఎక్కాడు. అదే సమయంలో వరంగల్‌ నుంచి నర్సంపేట వైపునకు డీసీఎం వేగంగా వెళ్తుండగా డ్రైవర్‌ గమనించి సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో వాహనం బాలుడికి దగ్గరగా వచ్చి ఆగిపోయింది. కాగా.. వెనకాలే వస్తున్న మెట్రో బస్సు అదుపుతప్పి డీసీఎంను ఢీకొట్టింది. దీంతో డీసీఎం ముందుకు కదలడంతో లక్ష్మణ్‌ టైరు కింద పడిపోయాడు. ఇది గమనించిన బాలుడి తల్లి కవిత, స్థానికులు అక్కడికి వచ్చి చూసేలోపు మృతి చెందాడు. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంజీవరావు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని ఆటోలో బంధువులు పోలీస్ స్టేషన్‌ వద్దకు తీసుకువచ్చి విలపిస్తూ తమకు న్యాయం చేయాలని కోరారు. దీంతో పోలీసులు వారికి సర్ధిచెప్పి అక్కడి నుంచి పంపించారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com