సరిహద్దులు దాటుతున్న రేషన్ బియ్యం


దారిద్రరేఖకు దిగువన ఉన్న నిరుపేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే రేషన్‌ బియ్యాన్ని కొందరు దళారులు పక్కదారి పట్టిస్తున్నారు. కేవ లం ఒక్క రూపాయికే సరఫరా చేసే సబ్సిడీ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు పక్కరాష్ట్రమైన మహారాష్ట్రకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పగలంతా బియ్యాన్ని సేకరిస్తూ రాత్రుళ్లు గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటిస్తున్నారు. బియ్యం అక్రమ సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన అక్రమార్కులు కొత్తమార్గాలను ఎంచుకున్నారు. సరిహ ద్దు ప్రాంతాల వద్ద తమ ప్రతినిధులను నియమించుకుంటూ ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. మహారాష్ట్ర సరిహద్దు మండలాలైన బోథ్‌, తలమడుగు, తాంసి, జైన థ్‌, బేల, నార్నూర్‌ మండలాల గుండా సబ్సిడీ బియ్యాన్ని యథే చ్ఛగా తరలిస్తున్నారు. ఏదో సమాచారం వస్తే తప్ప అధికారులు తనిఖీలు, దాడుల జోలికి అసలే వెళ్లడం లేదు. దీంతో దళారుల దందాకు హద్దు అదుపు లేకుండా పోతుంది. నిత్యం వందల క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టడానికి కొందరు అధికారులతో పాటు రేషన్‌ డీలర్ల సహాకారం అందుతున్నట్లు తెలుస్తోంది. ఇం త జరుగుతున్నా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద అధికారుల నిఘా కొరవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది.

మన బియ్యానికి మహారాష్ట్రలో డిమాండ్‌
పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో మన బియ్యానికి భారీగా డిమాండ్‌ ఏర్పడుతుంది. ఇదే అదునుగా కొందరు అక్రమార్కు లు రేషన్‌ బియ్యంపై కన్నెస్తున్నారు. ప్రత్యేకంగా నియమించుకు న్న దళారుల నుంచి రేషన్‌ బియ్యాన్ని పోగు చేస్తూ గుట్టు చ ప్పుడు కాకుండా నిల్వలు చేస్తున్నారు. మహారాష్ట్రలో ధర, డి మాండ్‌ ఉన్నప్పుడు లోడ్‌ చేస్తూ తరలిస్తున్నారు. కిలోకు రూ.10 నుంచి రూ.15 వరకు విక్రయించేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రూ.20 వరకు విక్రయించిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర దళారులతో పక్క నెట్‌వర్క్‌ పెట్టుకొని వ్యాపారులు అడ్డు వచ్చిన అధికారులతో పాటు పోలీసులకు నెలవారి మా ముళ్లు ముట్ట చెప్తున్నట్లు తెలుస్తోంది.

వస్తు మార్పిడి పద్ధతిలో బియ్యం సేకరణ
ప్రభుత్వం అందించే రేషన్‌ బియ్యాన్ని గ్రామాల్లో వస్తు మా ర్పిడి పద్ధతిలో సేకరిస్తున్నారు. ప్రధానంగా ఏజెన్సీ మండలాల్లో ఈ దందా జోరుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇచ్చోడ మండలంలోని ఓ గ్రామంలో కొందరు దళారులు ఇదే వృత్తిగా పని చేస్తున్నారు. సొంత ఆటోల ద్వారా చుట్టు పక్కల గ్రామా ల్లో తిరుగుతూ రేషన్‌ బియ్యాన్ని సేకరిస్తున్నారు.ఎక్కువ మంది దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఇష్ట పడడం లేదు. అలాంటి వారే రేషన్‌ బియ్యాన్ని విక్రయించి సన్న బియ్యంతో పాటు గోధుమ లు, శనగలను కొనుగోలు చేసుకుంటున్నారు. ఇలాంటి వారి అ వసరాన్ని ఆసరాగా చేసుకుని దళారులు దర్జాగా సబ్సిడీ బియ్యం దందాను చేస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని కొద్ది లాభంతో బడా వ్యాపారులకు విక్రయించి అందిన కాడికి దండుకుంటున్నారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com