ఐదుగురు మహిళలపై గ్యాంగ్‌ రేప్‌


జార్ఖండ్‌లో ఒక క్రైస్తవ స్వచ్ఛంద సంస్థకు చెందిన ఐదుగురు మహిళా కార్యకర్తలపై పత్థల్‌గడీ ఉద్యమకారులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఐదుగురు మహిళలు 20 నుంచి 35 ఏళ్లలోపు వారు. వారిలో ఒకరు వివాహిత. వీరంతా మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ఒక రోమన్‌ క్యాథలిక్‌ మిషనరీ పాఠశాలలో నాటకం ప్రదర్శిస్తుండగా మంగళవారం మిట్టమధ్యాహ్నం ఒంటిగంటకు మోటారు సైకిళ్ల మీద వచ్చిన సాయుధులు వారిని గ్రామ ప్రజలంతా చూస్తుండగా బలవంతంగా అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. మొత్తం 11 మంది సభ్యుల బృందంలో ఐదుగురు మహిళా కార్యకర్తలు, ఇద్దరు క్రైస్తవ సన్యాసినులు, ఇద్దరు పురుషులను తుపాకులు గురిపెట్టి అడవిలోకి లాక్కెళ్లారు. పురుషులను తీవ్రంగా కొట్టారు. ఐదుగురు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఇద్దరు క్రైస్తవ సన్యాసినులను ఏమీ అనలేదు. అత్యాచారం చేయడంతో పాటు దుండగులు తమ ఘాతుకాన్ని వీడియో కూడా తీశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వీడియోలను వైరల్‌ చేస్తామని హెచ్చరించారు.

ఈ సంఘటనపై కొచాంగ్‌ రోమన్‌ క్యాథలిక్‌ చర్చి ఫాదర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకోలేదు. దాంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర రాజధానికి రాంచీకి 90 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఆశా కిరణ్‌ అనే క్రైస్తవ స్వచ్ఛంద సంస్థ పరిసర ప్రాంతాలకు చెందిన 200 మంది మహిళలను పడుపు వృత్తి నుంచి రక్షించి, వారికి వసతి గృహాన్ని నిర్వహిస్తోంది. దీనికితోడు మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది.

జార్ఖండ్‌లోని ఖుంటి, సిండెగా, గుమ్లా, పశ్చిమ సింగ్బుం జిల్లాల్లో ప్రస్తుతం ఆదివాసీల పత్థల్‌గడీ ఉద్యమం జరుగుతోంది. గిరిజనులు బయటి వ్యక్తుల వలసను వ్యతిరేకిస్తూ అటవీ ప్రాంతమంతా భారీ ఎత్తున పోస్టర్లు వేశారు. ఇలాంటి ఉద్రిక్త వాతావరణంలో ఆశా కిరణ్‌ కార్యకర్తలు వీధి నాటకాలు వేసేందుకు వచ్చారు. వారిపై పత్థల్‌గడీ ఉద్యమకారులే అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు ధ్రువీకరించారు. నిందితుల కోసం మూడు బృందాలు భారీ ఎత్తున గాలింపు జరుపుతున్నాయి. గ్యాంగ్‌ రేప్‌ వెనుక మహిళల అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తుల పాత్ర ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల జాడ చెప్పిన వారికి రూ.50 వేల బహుమానం ఇస్తామని ప్రకటించారు. ఘటనపై దర్యాప్తు చేసేందుకు జాతీయ మహిళా కమిషన్‌ త్రిసభ్య బృందాన్ని హుటాహుటిన కొచాంగ్‌కు పంపించింది. మరోపక్క దర్యాప్తు సరిగా జరిగేట్లు చూడాలని జార్ఖండ్‌ డీజీపీని ఆదేశించింది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com