రష్యా జైత్రయాత్ర- ఈజిప్టుపై 3-1 తేడాతో విజయం


ప్రపంచ కప్‌లో ఆతిథ్య జట్టు రష్యా తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ప్రారంభ మ్యాచ్‌లో సౌదీ అరేబియాను 5-0 గోల్స్‌ తేడాతో చిత్తు చేసిన రష్యా మంగళవారం రాత్రి జరిగిన గ్రూప్‌ ఎ మ్యాచ్‌లో ఈజిప్టును 3-1 గోల్స్‌ తేడాతో ఓడించింది. ఈ విజయంతో రష్యా చివరి 16 జట్లలోకి చేరేందుకు మార్గాన్ని సుగమం చేసుకుంది. ఆట ప్రారంభం నుంచే ఇరుజట్లు పరస్పరం గోల్‌ చేయడానికి ప్రయత్నించాయి. సగం ఆట సమయం వరకు స్కోరు 0-0తో ఉంది. రష్యన్‌ మిడ్‌ ఫీల్డర్‌ రోమన్‌ జొబిన్‌ అత్యధిక సార్లు గోల్‌కోసం యత్నించాడు. విరామం అనంతరం తిరిగి మొదలైన ఆటలో రష్యా తొలి గోల్‌ నాటకీయ ఫక్కీలో జరిగింది. 47వ నిమిషంలో జొబిన్‌ కార్నర్‌ నుంచి బంతిని ఈజిప్టు గోల్‌ పోస్ట్‌వైపుకు కిక్‌ చేయగా ఈజిప్టు ఆటగాడు అహ్మద్‌ ఫాతి బంతిని తమ గోల్‌ కీపర్‌కు అందించబోయాడు కాని బంతి మిస్‌ అయి గోల్‌ పోస్ట్‌ లోకి వెళ్లిపోయింది. దీనితో రష్యాకు 1-0 ఆధిక్యం లభించింది. అనంతరం ఆట 59వ నిమిషంలో..డెనిస్‌ చెరిషెవ్‌ రష్యా స్కోరును డబుల్‌ చేశాడు. మారియో ఫెర్నాండెస్‌ అందించిన పాస్‌ను చెరిషెవ్‌ ఆలస్యం చేయకుండా గోల్‌ చేసి తన జట్టు ఆధిక్యాన్ని రెండుకు పెంచాడు. ఆట 62వ నిమిషంలో రష్యా ఆటగాడు కుటెపొవ్‌ కొట్టిన షాట్‌ను అద్భతంగా అందుకున్న అతని సహచరుడు అర్టెమ్‌ డిజ్యుబా ఈజిప్టు ఆటగాళ్లు గబ్ర్‌, ఎల్‌ షెనావిలకు బంతిని అందకుండా కట్‌చేస్తూ గోల్‌ చేశాడు. దీనితో రష్యా ఆధిక్యం 3-0కు చేరింది.
భుజం గాయంతో తొలి మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమైన ఈజిప్టు ఆటగాడు మహ్మద్‌ సలాహ్‌ 73వ నిమిషంలో పెనాల్టిdని గోల్‌గా మలిచి రష్యా ఆధిక్యాన్ని 3-1కు తగ్గించాడు. అనంతరం ఆట చివరివరకు ఇరుజట్లు గోల్స్‌ చేయలేకపోయాయి. 1966 నుంచి చూస్తే.. ప్రపంచ కప్‌ మ్యాచుల్లో రష్యా వరుసగా రెండు ప్రారంభ మ్యాచుల్లో గెలవడం ఇదే ప్రథమం. ప్రారంభ మ్యాచుల్లో రష్యా చేసిన 8 గోల్స్‌ ప్రపంచకప్‌ రికార్డు. 1934లో ఇటలీ చేసిన ఈ విధమైన రికార్డును తన పేర నమోదు చేసుకుంది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com