నవరతన్‌ బజ్జీలు


కావల్సినవి:

పాలకూర, తోటకూర, మెంతికూర, చుక్కకూర, బచ్చలకూర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లికాడలు (కాడలు మాత్రమే తీసుకోవాలి) - ఒక్కోటి కట్ట చొప్పున; మొక్కజొన్నపిండి, మైదా, బియ్యంపిండి - అరకప్పు చొప్పున; సెనగపిండి - ఒకటిన్నర కప్పు; ఉల్లిపాయలు - రెండు (ముక్కలుగా తరగాలి); అల్లంవెల్లుల్లి ముద్ద - చెంచా; ఉప్పు, కారం - రుచికి తగినంత; వాము, జీలకర్ర - రెండు చెంచాల చొప్పున; నూనె - వేయించడానికి సరిపడా; వంటసోడా- చిటికెడు.


తయారీ:


బాణలిలో మూడు చెంచాల నూనె వేసి.. ఆకుకూరలన్నింటినీ పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఇందులో అరకప్పు సెనగపిండి, మైదా, బియ్యంపిండి మొక్కజొన్నపిండి, అల్లంవెల్లుల్లిముద్ద, ఉల్లిపాయముక్కలు, తగినంత ఉప్పు, కారం, చెంచా చొప్పున జీలకర్ర, వాము వేసుకుని బాగా కలపాలి. గట్టిపిండిలా తయారైన ఈ మిశ్రమాన్ని బుల్లెట్లలా పొడుగ్గా చేసుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో కప్పు సెనగపిండి, మరికాస్త ఉప్పు, కొద్దిగా కారం, మిగిలిన వాము, జీలకర్ర, వంటసోడా తీసుకుని బజ్జీలపిండిలా గరిటెజారుగా కలపాలి. బాణలిలో నూనె వేడి చేసి.. ముందుగా సిద్ధం చేసుకున్న ఆకు కూరల బుల్లెట్లను ఈ పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేయించాలి. బంగారువర్ణంలోకి వచ్చాక తీసేస్తే సరిపోతుంది. తొమ్మిదిరకాల ఆకులతో చేసిన నవరతన్‌ బజ్జీలు టమాటాసాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com