
మహిళపై సామూహిక అత్యాచారం

కల్వకుర్తి: ఒంటరి మహిళపై నలుగురు యువకులు దారుణానికి ఒడిగట్టారు.. బతుకుతెరువైన చిరువ్యాపారం పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరిన ఆమెను అడ్డగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ భర్త మరణించడంతో కల్వకుర్తిలో చిరువ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తోంది. సోమవారం రాత్రి వ్యాపారం ముగిసిన తరవాత ఇంటికి వెళ్తుండగా అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు ఆమెను అడ్డగించి, బలవంతంగా పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల వద్దకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో ఆమెను ద్విచక్రవాహనంపై మరో ప్రాంతానికి తీసుకెళ్తుండగా కేకలు వేసింది. గమనించిన స్థానికులు ఆ యువకులను అడ్డుకుని పోలీస్ కంట్రోల్ రూమ్(100)కు సమాచారం ఇచ్చారు. వాహనాలు వదిలి యువకులు పారిపోగా.. అప్పటికే గాలింపు ప్రారంభించిన పోలీసులు రెండు గంటల్లోనే వారిని పట్టుకున్నారు. బాధిత మహిళను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. మంగళవారం ఉదయం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు