బ్యాంకుదోపిడీ


భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: రవుర్కెలా నగరంలో పట్టపగలు బ్యాంకుపై దోపిడీ ముఠా పడి రూ.44లక్షలు దోచుకుని పరారైన ఘటన చోటుచేసుకుంది. రవుర్కెలా మధుసూదన్‌ లేన్‌ ప్రాంతంలో ఉన్న ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు శాఖలో ఈ ఘటన చోటు చేసుకుంది. రవుర్కెలా ఎస్పీ ఉమాశంకర్‌ దాస్‌, ఇతర పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నగరం ప్రవేశ ద్వారాలను సీజ్‌ చేసి మార్గాల్లో రాకపోకలు చేసే వాహనాలు, వ్యక్తులను తనిఖీలు ప్రారంభించారు. ఘటనపై ఎస్పీ అందించిన వివరాల ప్రకారం.. మంగళవారం బ్యాంకు తెరిచేక 12 గంటలు సమయంలో ఎనిమిది మంది దోపిడీ దొంగలు ముఖాలకు మాస్క్‌లు, శిరస్త్రాణాలు ధరించి మారణాయుధాలతో బ్యాంకు లోపలకు ప్రవేశించారు. ప్రవేశద్వారం వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డును అదుపులో తీసుకుని బ్యాంకు అధికారులు, సిబ్బంది, వినియోగదారులను గన్‌తో బెదిరించారు. వారి వద్ద ఉన్న చరవాణులు లాక్కున్నారు. అనంతరం అందర్ని ఒక గదిలో నిర్బంధించారు. బ్యాంకు లాకర్‌ను పగులగొట్టి అందులో ఉన్న రూ.44లక్షలు దోచుకున్నారు. అనంతరం సీసీ కెమెరాలను విరిచివేయడంతో పాటు కెమెరాలకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌ను కూడా తీసుకుని పరారయ్యారు. అలాగే రవుర్కెలాలో మంగళవారం మరో దోపిడీ ఘటన జరిగింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కచేరి శాఖ నుంచి ఇద్దరు సిబ్బంది రూ.4లక్షలు తీసుకుని మరో శాఖకు వెళ్తుండగా మార్గంలో బైకుపై వచ్చిన దుండగులు పసరా వద్ద సిబ్బందిని అడ్డుకున్నారు. వారి వద్ద ఉన్న డబ్బు దోచుకుని పరారయ్యారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com