చివరి టెస్టులోనూ కంగారూలదే విజయం‌


ప్రతిష్టాత్మక్ యాషెస్‌ సిరీస్‌ను ఆసీస్‌ 4-0తో కైవసం చేసుకుంది. సిడ్నీలో జరిగిన చివరి టెస్టులో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 123 పరుగులతో విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టు మ్యాచుల సిరీస్‌ను కంగారూల జట్టు 4-0తో దక్కించుకుంది. నాలుగో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.

చివరి టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. కమిన్స్‌ ధాటికి ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్లు విలవిలలాడిపోయారు. దీంతో ఆ జట్టు 346 పరుగులకే చేతులెత్తేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 649/7 వద్ద తన తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ మరోసారి కమిన్స్‌ ధాటికి 180 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 123 పరుగులతో ఘన విజయం సాధించింది. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్లు డేవిడ్‌ వార్నర్‌(56), కవాజా(171), స్మిత్‌(83), షాన్‌ మార్ష్‌(156), మిచెల్‌ మార్ష్‌(101) రాణించారు. ఇంగ్లాండ్‌ను కప్పకూల్చిన కమిన్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆసీస్‌కు విజయాలను అందించిన స్మిత్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అందుకున్నాడు.

5 మ్యాచుల సిరీస్‌ను 4-0తో కైవసం చేసుకోవడంతో ఆసీస్‌ 104 పాయింట్లతో తాజా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 3వ స్థానానికి ఎగబాకింది. మరో పక్క ఇంగ్లాండ్‌ ఐదో స్థానానికి పడిపోయింది. 124 పాయింట్లతో భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com