పాముకాటూ, పన్నుపోటూ
లిండ్సే లోహన్ ఇప్పుడు రెండు ఇబ్బందులతో సతమతమవుతోంది. ఎప్పుడో ఆరేడేళ్ల క్రితం ఆమె నటించిన చిత్రాలైన ‘మెషేట్’, ‘2 బ్రోక్ గర్ల్స్’ ఆమెను అమెరికా ప్రభుత్వ ఆదాయశాఖవారి లెక్కల్లో చిక్కుల్లో పడేశాయి. ఆనాటి పారితోషికాలను లెక్కలోకి తీసుకుంటే, ఆమె ఇప్పుడు ఒకలక్షా ఏడువందల పది డాలర్‌ల వరకూ బాకీ ఉందని ప్రభుత్వం లెక్కగట్టింది. అంటే, దాదాపు 70 లక్షల రూపాయలన్నమాట! ఇంత మొత్తం ఒకేసారి కట్టడం ఎవరికైనా కష్టమే! ఇదొక కష్టమనుకుంటే, హాలీడేస్ గడపడానికి థాయ్‌లాండ్ వెళ్లిన ఆమెను అక్కడ ఓ పాము కాటేసిందట! తనను పాము కుట్టిందంటూ ఆమె అభిమానులకు తెలియపర్చగానే, అభిమానుల్లో అలజడి ఆరంభం అయింది. అయితే, తాను కోలుకొని క్షేమంగానే ఉన్నానని ఆమె తెలియజేసింది.1961 నాటి ‘ది పేరెంట్ ట్రాప్’ (ఇదే తెలుగులో బేబి పద్మిని రెండు రకాల పాత్రల్లో నటించిన ‘లేతమనసులు’ చిత్రంగా వచ్చింది) చిత్రానికి రీమేక్‌గా నిర్మించిన చిత్రంలో నటించిన లిండ్సే, ఆ చిత్రంతోనే తన నటజీవితానికి శ్రీకారం చుట్టింది. కొత్తగా ఎదురవుతున్న పాముకాటు, పన్నుపోటుల నుంచి ఆరోగ్యంగానే బయటపడతానని ఆమె హామీ ఇస్తోంది.
Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు