దీపికకు అరబ్‌ అభిమానుల కానుక


బాలీవుడ్‌ బ్యూటీ దీపిక పదుకొణె.. జనవరి 5న తన 32వ పుట్టినరోజు జరుపుకొన్నారు. దీపిక పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందు నుంచే అభిమానుల నుంచి దీపికకు సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వారిలో అరబ్‌కి చెందిన అభిమానులు కూడా ఉన్నారు. దీపిక బర్త్‌డేని పురస్కరించుకుని తమ అభిమాన నటి కోసం ఏదన్నా ప్రత్యేకంగా చేయాలనుకున్నారు. ఇందుకోసం సౌదీలోని ఓ గ్రామంలో ప్రజలకు బావి కట్టించారు. ఈ సందర్భంగా బావి ఫొటోలు తీసి దీపికను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు.

‘బర్త్‌డే సందర్భంగా మీకు ఇదే మా ప్రత్యేక కానుక. సౌదీలోని ఓ గ్రామంలో ప్రజల దాహం తీర్చేందుకు బావి కట్టించాం. మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దీపిక తనకు శుభాకాంక్షలు చెప్పినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

దీపిక టైటిల్‌ పాత్రలో నటించిన ‘పద్మావతి’ చిత్రం పలు వివాదాలు ఎదుర్కొని ‘పద్మావత్‌’ టైటిల్‌తో ఫిబ్రవరిలో విడుదల కాబోతోంది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌ నటించారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com